AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

Vaibhav Sooryavanshi: అండర్ 19 ప్రపంచకప్ 2026లో వైభవ్ సూర్యవంశీ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌తో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై కనికరం చూపకుండా బడితపూజ చేశాడు. దీంతో భారత జట్టు ఆరోసారి ట్రోఫీని దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ 14 ఏళ్ల సెన్సేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 1:06 PM

Share

Vaibhav Sooryavanshi: హరారేలో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసతో ఇంగ్లాండ్ జట్టు చిత్తుగా ఓడింది. తన అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లీష్ బౌలర్లపై వీరవిహారం చేసిన ఈ 14 ఏళ్ల సంచలనం క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. ఈ డేంజరస్ హిట్టింగ్ తో భారత జట్టు ఫైనల్‌పై ఆధిపత్యం చెలాయించడమే కాకుండా, సోషల్ మీడియాలో అనేక స్పందనలకు దారితీసింది. అయితే, ఇందులో ఓ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐస్లాండ్ క్రికెట్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ వేగంగా వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తుగా బాదేసిన సూర్యవంశీని అరెస్టు చేయాలని సరదాగా పిలుపునిచ్చింది.

వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని ఐస్‌లాండ్ క్రికెట్ డిమాండ్ చేసింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసిన వెంటనే, ఐస్లాండ్ క్రికెట్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేసింది. అది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఆ పోస్ట్‌లో.. ” వైభవ్ సూర్యవంశీని ఎవరైనా వెంటనే అరెస్టు చేయాలి, ఇంగ్లాండ్ బౌలర్లపై మైదానంలో జరిగిన ఈ హింస ఎక్స్-రేట్‌డ్‌లా ఉంది” అని ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్‌లో పేర్కొంది.

ఆ ట్వీట్ కేవలం హాస్యం కోసం పోస్ట్ చేసింది. వైభవ్ ఇన్నింగ్స్ ఎంతో డేంజరస్ గా ఉందంటూ ప్రశంసలు కురిపించిందన్నమాట. ఈ పోస్ట్‌ ను అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. టోర్నమెంట్‌లోనే అతిపెద్ద మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థిపై ఎలాంటి కనికరం చూపలేదు. ఈ క్రమంలో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు.

ఇంగ్లాండ్ బౌలర్లు పేస్, స్పిన్, షార్ట్ బాల్స్, నెమ్మదిగా బంతులను ప్రయత్నించారు. ఏదీ పని చేయలేదు. స్కోరింగ్ రేటు ఎప్పుడూ తగ్గలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి, వైభవ్ భారీ భాగస్వామ్యాన్ని జోడించిన సంగతి తెలిసిందే. ఇది ఇంగ్లాండ్‌ను పూర్తిగా వెనుకబడిపోయేలా చేసింది.

అయితే, వైభవ్ డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్ U19 ప్రపంచ కప్ చరిత్రలో చిరస్థాయిగా నిలిపేలా చేసింది. 175 పరుగుల స్కోరు ఇప్పటికీ U19 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్