AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతని ఇంట్లో ఒక్కపూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా: మంగ్లీ సంచలన ప్రకటన

సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని సంచలన ప్రకటన చేశారు. రమావత్ మధుతో ఒక్కపూట భోజనం చేసినందుకే క్షోభ అనుభవిస్తున్నానన్నారు. కొందరు కావాలనే తనపై కుట్ర పన్నుతున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో సంబంధం లేదని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

అతని ఇంట్లో ఒక్కపూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా: మంగ్లీ సంచలన ప్రకటన
Singer Mangli
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2026 | 12:49 PM

Share

సింగర్‌ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. బాధితులు రోడ్డెక్కుతుండటం, బాధితుల తరపున గిరిజన సంఘాల నేతలు పోరాటం చేస్తుండటం మరింత హీట్‌ పెంచుతోంది. అయితే.. తనపై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందన్న మంగ్లీ..బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ప్రకటించారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ ఆర్థిక మోసంలో తనకుఎ ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.. ఈ సమయంలోనే.. తనపై పెట్టిన కేసుపై మరోసారి మంగ్లీ స్పందించారు. రమావత్‌ మధుపై విరుచుకుపడిన సింగర్‌ మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి.. పట్టుబడితే నా బ్యాండ్‌తో కలిసి ఇంటికెళ్లి భోజనం చేశానన్నారు. ఒకపూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా.. అంటూ పేర్కొన్నారు.

కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని.. రమావత్‌ మధు చేసిన మోసాల్లో తనకు 1శాతంకూడా సంబంధం లేదన్నారు. ప్రజల్ని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదన్నారు. తన కుటుంబ సభ్యులకూ ఈ మోసంతో సంబంధం లేదన్నారు. బండి శివ పేరుని తన తమ్ముడు శివచౌహాన్‌గా ప్రచారం చేస్తున్నారన్నారు. పదే పదే అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారని.. తాను.. తన కుటుంబ సభ్యులు ఎక్కడికీ పారిపోలేదని పేర్కొన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుంది అంటూ మంగ్లీ నోట్‌ విడుదల చేశారు.

మంగ్లీ నోట్..

ఇటీవల ఈ ఫ్రాడ్‌ కేసు బాధితుడు నల్గొండ జిల్లా పెద్దవూరకు చెందిన పాల్తి రమేష్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మంగ్లీ నోట్‌ విడుదల చేసింది. రమావత్‌ మధు బాధితుడిగా అభివర్ణిస్తూ మంగ్లీ తాను విడుదల చేసి నోట్‌లో రాసుకొచ్చింది. ఆయన మృతి బాధాకరమని చెబుతోంది మంగ్లీ.

ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదు..

మరోవైపు మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్.. మంగ్లీపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అడ్వొకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ కేసులో వాస్తవాలు ఏంటనేది పోలీసు విచారణలో తేలుతాయన్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లకు చట్టపరంగానే సమాధానమిస్తామని అంటున్నారు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర