AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమైనవి. కాశీ క్షేత్రంలో శివుడు విశ్వనాధుని గా కొలవబడుతున్నారు. అయితే ఆ కైలాస నాధుడికి భువిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి అతి పురాతన ఆలయాల్లో ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ తాజాగా ఓ అద్భుతం జరిగింది.

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..
Shiv Lingam Discovery
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 1:00 PM

Share

ఏలూరు : పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తే.. శివుడు సృష్టిసర్వం లో ఉన్నారని సమాదానం వినిపిస్తుంది. హిమాలయాలు, నదులు, కొండలు, అరణ్యాలు అన్నిటిలోనూ ఆయన శక్తీ అంతర్లీనంగా కనిపిస్తుంటుంది అని భక్తుల నమ్మకం. భక్తి తో పూజించే వారి మదిలో నిత్యం కొలువుతీరి ఉంటారని చెబుతారు. పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమైనవి. కాశీ క్షేత్రంలో శివుడు విశ్వనాధుని గా కొలవబడుతున్నారు. అయితే ఆ కైలాస నాధుడికి భువిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి అతి పురాతన ఆలయాల్లో ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ తాజాగా ఓ అద్భుతం జరిగింది.

ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల ఆలయ ప్రకార పనులు ప్రారంభించారు. ఈ ఆలయాన్ని వేంగి రాజు రాజ రాజ చోళుడు పాలనా కాలంలో నిర్మించినట్లు స్థల పురాణం. ఈప్రాంతానికి చెందిన రైతు తన పొలం దున్నుతుండగా నాగలికి శివలింగం తగిలిందని, నెత్తురు వరదలై పారిందనేది పూరణ కధనం. రాజ రాజ చోళుడుకుమారుడు రాజ రాజ నరేంద్రుని కాలంలో ఈ ఘటన జరిగిందని చెబుతారు.

కలిదిండికి మూడు మైళ్ళ దూరం లో శివలింగం బయట పడటం నాగిలి కర్రుకు తగిలి లింగం విరిగిపోవటం తో ఆ విరిగిన శివలింగాన్ని తిరిగి అతికించారట. ఇలా అతికించిన బాగాన్ని భక్తులు గర్భగుడిలో ఇప్పటికి చూసి తరిస్తారు. ఇక, ఈ ఆలయంలో మరో విశేషముంది.. ఇక్కడ ఒక కోనేరు ఉంది. అక్కడికి వెళ్లి హర హర అంటే బుడ బుడ అనే శబ్దంతో నీరు ఉబికి వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయం లో ప్రాకార పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన తవ్వకాల్లో పురాతన శివలింగం బయట పడింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఈ ఆలయం అతి ప్రాచీనమైన పురాతన శివలింగం గా ప్రచారంలోకి రావటం తో తాజాగా బయట పడ్డ రాతి శివలింగాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కొద్దీ రోజుల్లో శివరాత్రి మహోత్సవాలు జరుగుతుండగా విశేషంగా ఈ ఘటన వెలుగులోకి రావటంతో, పురాతన లింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us