AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే!

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని రకాల సేవలను ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయాలని నిర్ణయింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు తాజాగా అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే!
Ap Government Services
Anand T
|

Updated on: Apr 30, 2026 | 7:00 AM

Share

బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని సేవలను తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 1,035 సేవలు అందుబాటులో ఉన్నాయని. వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగం పై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించామని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఏర్నాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ 1 అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని. ఇప్పటికే ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని, మే నెల రెండో వారంలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యిందని అధికారులు ఇచ్చిన వివరణ పై స్పందించిన సీఎం.. ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో నేర నియంత్రణ కోసం సీసీ టీవీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలన్నారు సీఎం చంద్రబాబు. నేరస్తులను గుర్తించడం, వాహనాల దొంగతనాల అదుపు, మిస్సింగ్ కేసుల ట్రేసింగ్‌లో ఏపీ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డేటాను కూడా ప్రభుత్వ వ్యవస్థతో ఇంటిగ్రేట్ చేయాలని సీఎం ఆదేశించారు.సీసీ కెమేరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించు కునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారుకు సీఎం నిర్దేశించారు.

శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అనుసంధానించి వేగంగా చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఇటీవల తిరుమల-తిరుపతి సమీపంలో శేషాచల అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించిన ఘటనపై వేగంగా స్పందించే అవకాశం ఉండేదన్నారు. డీజిల్, పెట్రోలు సరఫరా పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో మళ్లీ సాధారణ స్థితికి నెలకొందని.. అయితే సమస్య ఉత్పన్నం కాకముందే రియల్ టైమ్‌లో స్పందించేలా చర్యలు ఉండాలని సీఎం సూచించారు.

మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us