Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope (April 30, 2026): గురువారం రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి ఆర్థికంగా అనుకూల సమయం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు విస్తరించడం, పెండింగ్ పనులు పూర్తవడం, ఉద్యోగాల్లో గుర్తింపు పెరగడం వంటి శుభ సూచనలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి పని ఒత్తిడి, చిన్నచిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ, పట్టుదలతో విజయాలు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ సహకారం, మిత్రుల మద్దతుతో ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 30, 2026): మేష రాశి వారి ఆదాయ ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ సేవల్ని బాగా ఉపయోగించుకుంటారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ సేవల్ని బాగా ఉపయోగించుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా మాటకు, చేతకు తిరుగుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. కుటుంబంతో హ్యాపీగా గడుపుతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఊరట కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు దొర్లే అవకాశం కూడా ఉంది. కొందరు బంధువుల వల్ల చికాకులు తలెత్తుతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వల్ల నష్టపోవడం జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి శ్రమ, తిప్పటలతో పనులన్నిటినీ చక్కబెడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడ తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదా యం బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. మిత్రులకు సహాయం చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఢోకా ఉండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్య మైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉండవచ్చు. గతంలో మీ సాయం పొందినవారు ముఖం చాటేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి బాగా లాభం పొందుతారు. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. మిత్రుల తోడ్పాటుతో వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)