AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

తల్లిదండ్రుల కష్టానికి తన అనారోగ్యం తోడు అవ్వకూడదని మనస్తాపంతో ఓ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాష్‌ (16) కొత్తవలసలోని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ చదువుతున్నాడు. తీవ్ర తలనొప్పితో బాధపడుతూ, చివరకు హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చలేకపోతున్నానన్న బాధ, విపరీతమైన తలనొప్పే కారణమని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..
Vikas
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 1:17 PM

Share

తల్లిదండ్రుల కష్టానికి తన అనారోగ్యం తోడు అవ్వకూడదని మనస్తాపంతో ఓ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అందరినీ కలిచి వేస్తుంది. కాకినాడ జిల్లా యానాం సమీపంలోని కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఉదికి సుబ్రహ్మణ్యం, స్వర్ణలత దంపతుల ఏకైక కుమారుడు వికాష్ (16). తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని, మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. డిఫెన్స్ రంగంలో చేరాలన్న లక్ష్యంతో కొత్తవలసలోని ఓ ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తుండటంతో, వారిని ఆదుకోవలన్న తపన వికాష్ మనసులో చిన్నతనం నుంచి ఉంది.

అయితే డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న వికాస్ ఇటీవల కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పి బాధ పడుతున్నాడు. కళాశాల యాజమాన్యం అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించినా, నొప్పి తగ్గలేదు. బుధవారం సాయంత్రం సెలవు ఇచ్చి ఇంటికి పంపాలని వికాష్ కోరడంతో, యాజమాన్యం అతని తల్లిదండ్రులతో మాట్లాడింది. సాయంత్రం కావడంతో రాత్రివేళ ప్రయాణం సురక్షితం కాదని, మరుసటి రోజు ఉదయం తీసుకెళ్తామని తల్లిదండ్రులు సూచించారు. దీంతో వికాష్ హాస్టల్ రూంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలా మరుసటి రోజు ఉదయం వికాష్‌ హాస్టల్ రూం లో ఉండగా అదే గదిలో తనతో పాటు ఉంటున్న రూమ్ మెట్స్ తరగతులకు వెళ్లిపోయారు. వారంతా క్లాస్‌లు ముగించుకుని మధ్యాహ్నం గదికి తిరిగి రావడంతో, వికాష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందిన ఘటన కనిపించింది. దీంతో వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు తోటి రూమ్ మెట్స్. వెంటనే వారు తల్లిదండ్రులను పిలిపించారు. మొదట తల్లిదండ్రులు యాజమాన్యం మీద అనుమానం వ్యక్తం చేసినా, వారి కష్టాలు, కుమారుడి బాధ, గత మూడు రోజులుగా బాధిస్తున్న తీవ్రమైన తలనొప్పి కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వికాష్.. ఉపాధ్యాయుల వేధింపులు లేవని, తనపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారని పేర్కొంటూ ఒక లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చలేకపోతున్నాననే భావోద్వేగం, అదీ కాక విపరీతమైన తలనొప్పి తన ఆత్మహత్యకు కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించాక, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శృంగవరపుకోటకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..