AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..

హైదరాబాద్‌లో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు ప్రియులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..
Hyderabad Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2026 | 10:15 AM

Share

‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు అసలు ఏం కావాలి.. ప్రేమ నా లేక శృంగారమా..? ’’ అంటూ ఓ భర్త.. ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సీతారాం ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ఏ అమ్మాయి కూడా అలా చేయవద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు.. ఈ క్రమంలోనే.. భార్య వివాహేతర సంబంధాలు బయటపడటం, ఇన్‌స్టాలో వీడియోలు బయటపడటంతో ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే.. సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

తన భార్య వివాహేతర సంబంధాలే తన చావుకు కారణం అంటూ సీతారాం లేఖలో ప్రస్తావించాడు.. 19 పేజీల్లో రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాలు రాశాడు.. రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం నడిపిందని తెలిపాడు. ఒకరితో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు..

‘‘ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.. అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి? అవి చూశాకే తెలిసింది నా భార్య నిజస్వరూపం.. నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది’’.. అంటూ సూసైడ్‌ లెటర్‌లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు.. తాను ఇంట్లో లేని సమయంలో రమణ పలుమార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడని.. అసలు రేణుకకు ఏం కావాలి.. అంటూ ఆ లేఖలో ప్రశ్నించాడు సీతారాం..

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సూసైడ్ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..