అందుకే సినిమాలను తగ్గించా.. అసలు విషయం బయటే పెట్టిన సమంత.. నిరాశలో ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది.

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది. అయితే ఏడాది గ్యాప్ తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటుందని అనుకుంటా ఆమె స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తాను సినిమాలు తగ్గించడం పై ఆసక్తికర విషయం చెప్పింది.
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
సమంత మాట్లాడుతూ.. గతంతో పోల్చితే ఇప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. నేను సినిమాల పైన అలాగే ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టా.. సినిమాలు, సిరీస్ లు ప్యాషన్ కోసమో, గుర్తింపు కోసమో చేసేవి కావు.. అవన్నీ నా మనసుకు దగ్గరైన కథలే.. ప్రస్తుతం సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నా.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా.. ఒకేసారి 5 సినిమాలు చేయను.. తక్కువ సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండే సినిమాలు చేస్తాను .. నా శరీరం చెప్పింది వినాలని అనుకుంటున్నా అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








