Maha Samudram : మహాసముద్రంలో ముందుగా ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట కానీ కుదరలేదు..
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే
Maha Samudram : శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ( నేడు ) ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. స్నేహం చేసినప్పుడు అవతలవారు ఒక్కోసారి తప్పు చేసినా స్వీకరించగలగాలి అన్నారు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ‘మహా’. ఈ పాత్రలో అదితిరావు హదారి కనిపించనుంది.
అయితే ముందుగా ఈ సినిమాలో మహా పాత్రకు సమంతను అనుకున్నాం కానీ కనుకొని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించలేదు. అప్పుడు ఈ పాత్రకు అదితి అయితే న్యాయం చేస్తుందనిపించింది. దాంతో ఆమెను సంప్రదించాం అన్నారు. ఈ సినిమా ఈ పండగకి తప్పకుండా పెద్ద హిట్ కొడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు అజయ్ భూపతి. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని అన్నారు అజయ్. మహా సముద్రం జర్నీ అనేది నా జీవితంలో మర్చిపోలేనిది. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరు హీరోల కథలు రాసుకుని చాలామంది హీరోలను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను అన్నారు. ఇక రావు రమేష్ ద్వారా శర్వాని కలిసే అవకాశం దొరికింది. సిద్దార్థ్‌కు శర్వానంద్ కంటే ముందే ఈ కథలు చెప్పి ఒప్పించాను అన్నారు అజయ్.
మరిన్ని ఇక్కడ చదవండి :