Tamosoma jyothirgamaya: నేత కార్మికుల జీవన స్థితికి అద్దంపట్టే మూవీ ‘తమసోమా జ్యోతిర్గమయ’ ప్రతి ఒక్కరూ చూడాలని కేటీఆర్ పిలుపు

Surya Kala

Surya Kala |

Updated on: Oct 13, 2021 | 9:30 PM

Tamosoma jyothirgamaya: మల్లేశం, కాంచివరం తరహాలోనే చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కిన మరో చిత్రం తమసోమా జ్యోతిర్గమయ. ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్..

Tamosoma jyothirgamaya: నేత కార్మికుల జీవన స్థితికి అద్దంపట్టే మూవీ 'తమసోమా జ్యోతిర్గమయ' ప్రతి ఒక్కరూ చూడాలని కేటీఆర్ పిలుపు
Tamosoma Jyothirgamaya

Follow us on

Tamosoma jyothirgamaya: మల్లేశం, కాంచివరం తరహాలోనే చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కిన మరో చిత్రం తమసోమా జ్యోతిర్గమయ. ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత వృత్తిలో ఎన్నో ఆవిష్కరణలు రావాలని, ఇందుకు ‘తమసోమా జ్యోతిర్గమయ’లాంటి చిత్రాలు దోహదపడతాయని చెప్పారు.  ఈ సినిమా చేనేత వృత్తిలోని కష్టాలు, కన్నీళ్లనే మాత్రమే కాదు చేనేత గొప్పదనాన్ని చాటిచెబుతుందని తెలిపారు. యువత చేనేత రంగంవైపు అడుగేసేలా చేస్తుందని..  మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ చెప్పారు.

‘తమసోమా జ్యోతిర్గమయ’. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం వెండి తెరకు పరిచయం అవుతున్నారు. గుణ ఎంటర్ టైమెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మించారు. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సినిమా గురించి సహా నిర్మాత సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత నచ్చడంతోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ అనుకున్నట్లు చెప్పారు. మన నిజజీవిత కథలు.. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని అన్నారు.

నిర్మాత తడక రమేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో నాకు చాలా నమ్మకం ఉంది.నేను ఏ పని చేసిన కూడా దేవుడు నాకు ఎప్పుడు పూర్తీ సహకారం అందిస్తున్నాడన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి చేతివృత్తుల వాళ్ళు కూడా మారగలిగితే చాలా మంది కి ఉపాధి దొరుకుంటుంది అని చెప్పే ఉద్దేశం ఇది.  ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు చెప్పారు.

దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోచంపల్లి చుట్టుపక్కల పరిసరాల్లోనే పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న సినిమా ఇది. ‘తమసోమ జ్యోతిర్గమయ’ మూవీలో 2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితిని ఈ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. తనకు సహకరించిన చిత్ర యూనిట్ కు కృతఙ్ఞతలు చెప్పారు.

హీరో ఆనంద్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చిన గుణ ఎంటర్ టైనేమెంట్స్ వారికీ థాంక్స్  చెప్పాడు.

హీరోయిన్ శ్రావణిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను హీరోయిన్ గా తీసుకున్నందుకు దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు చెప్పారు. చేనేత కార్మికుల కష్టాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Also Read:  కోల్ కతాలో వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు.. ఆకర్షణీయంగా పండల్స్ (photo gallery)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu