Samantha: మయోసైటిస్‌పై సమంత భావోద్వేగం.. ఇంతదాకా వచ్చానా అంటూ కన్నీటిపర్యంతం..
మయోసైటిస్ అనారోగ్యంపై సమంత భావోద్వేగానికి గురయ్యింది. యశోద ప్రమోషన్స్ కోసం జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికింకా నేను చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.

గత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. చేతికి సెలైన్ పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేస్తూ.. తనకున్న వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. తాజాగా మయోసైటిస్ అనారోగ్యంపై సమంత భావోద్వేగానికి గురయ్యింది. యశోద ప్రమోషన్స్ కోసం జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికింకా నేను చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. సామ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు ఆమె కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయిన నేపథ్యంలో సామ్ స్పందించింది. తాను ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ‘యశోద’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాను పూర్తి చేసేందుకు సామ్ శాయశక్తులా ప్రయత్నించింది. ప్రస్తుతం సామ్ యశోద సినిమా ప్రమోషన్లలో పాల్గోంటుంది. ఇప్పటివరకు మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యింది.
జీవితంలో కొన్ని రోజులు మంచి రోజులు. మరికొన్ని రోజులు చెడ్డరోజులు వస్తాయి. ఇప్పటికింకా నేను చావలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక నేను ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమోననిపించింది. అయినా ఇప్పుడు ఒక్క సారి వెనుతిరిగి చూస్తే ఇంత దాకా వచ్చానా అనిపిస్తోంది.. అంటూ ఎమోషనల్ అయ్యారు సామ్.




ఇక తన మయోసైటిస్ వ్యాధి గురించి తెలియజేస్తూ.. జీవితంలో అనేకా సవాళ్లు ఉంటాయని.. మీ అందరి ప్రేమ, అనుబంధమే కొత్త లైఫ్ ఇస్తుందంటూ చెప్పుకొచ్చింది. “కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ దానికి నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతోంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని రియలైజ్ అయ్యాను. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్ చేయలేనేమో అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి.” అంటూ ట్వీట్ చేసింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




