Allu Arjun: పుష్ప 2 పై స్పెషల్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. పంచ్‏లైన్‏తో అదరగొట్టిన బన్నీ..

ఉర్వశివో రాక్షసివో సినిమా మా గీత ఆర్ట్స్ బ్యానర్ కే కాదు మా ఫ్యామిలీ అందరికీ వెరీ స్పెషల్ మూవీ.ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు కానీ.. ఇది మాకు స్వీట్ మెమోరీగా గుర్తుండి పోయే స్పెషల్ మూవీ అన్నారు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్.

Allu Arjun: పుష్ప 2 పై స్పెషల్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. పంచ్‏లైన్‏తో అదరగొట్టిన బన్నీ..
Allu Arjuna Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 9:02 AM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప. సౌత్ టూ నార్త్ ఆడియన్స్‏ను సామీ సామీ అంటూ ఉర్రుతలుగించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక చాలా రోజులుగా పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. అయితే సూపర్ హిట్ సిక్వెల్ అప్డేట్స్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు బన్నీ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఊర్వశివో… రాక్షసివో సక్సె్స్ మీట్ లో పాల్గోన్న బన్నీ.. పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉర్వశివో రాక్షసివో సినిమా మా గీత ఆర్ట్స్ బ్యానర్ కే కాదు మా ఫ్యామిలీ అందరికీ వెరీ స్పెషల్ మూవీ.ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు కానీ.. ఇది మాకు స్వీట్ మెమోరీగా గుర్తుండి పోయే స్పెషల్ మూవీ అన్నారు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ మాట్లాడుతూ…”ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టర్. అందరూ బాగా చేసినా డైరెక్షన్ సరిగా చెయ్యకపోతే డెడ్ బాడీ కి డెకరేషన్ చేసినట్లుంటుంది. GA2 బ్యానర్ పెట్టిన మా బన్నీ వాసు చెప్పినట్టు నేను, వాసు, వాసు నేను అనేది వేరు కాదు మా ఇద్దరం ఒకటే.ఈ విషయంలో మా నాన్నకి ఎంత రేటింగ్ ఇస్తానో వాసుకు కూడా అంతే రేటింగ్ ఇస్తాను. తనెప్పుడూ నాగురించే ఆలోచిస్తుంటాడు. ఇందులో సునీల్, వెన్నెల కిషోర్ లు చాలా బాగా చేశారు. మా తమ్ముడు గురించి మాట్లాడాలి. నా సినిమా సక్సెస్ అయినా నేను ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో.. మా తమ్ముడు సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ నువ్వు ఏం చేయక పోయినా పర్లేదు ఐ లవ్ యు. హిట్ కొట్టినా కొట్టక పోయినా నువ్వు నాకు ఆల్వేస్ సక్సెస్ పుల్. అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తాను. “పుష్ప” వన్ తగ్గేదే లే అయితే.. “పుష్ప 2″ అస్సలు తగ్గేదేలే. నేను కూడా ఈ సినిమా కొరకు చాలా ఎగ్జైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నాను” అన్నారు.

ఇవి కూడా చదవండి

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప చిత్రంలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించారు బన్నీ. ఇందులో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. పుష్ప 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ