Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Gym Workout Video: బాబోయ్ సమంత.. ఆ వర్కవుట్స్ ఏంటి.. అసలేం చేస్తున్నావ్..? 

ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న స్యామ్.. తన జిమ్ వర్కవుట్స్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే తన బాడీని మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంది.. ఇప్పటికే మానసికంగా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్న స‌మంత.. తను ఫిజికల్‌గానూ అంతే బలంగా ఉన్నానని నిరూపించుకునే పనిలో పడిపోయింది. ఎప్పుడూ జిమ్‌లోనే ఉంటూ చమటలు కక్కిస్తుంది స్యామ్.

Samantha Gym Workout Video: బాబోయ్ సమంత.. ఆ వర్కవుట్స్ ఏంటి.. అసలేం చేస్తున్నావ్..? 
Samantha
Follow us
Praveen Vadla

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 25, 2023 | 12:30 PM

ఇప్పుడు సమంతను చూస్తుంటే అభిమానులకు కూడా ఇదే అడగాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేస్తున్న వర్కవుట్స్ అలా ఉంటున్నాయి మరి. సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ చాలా ఫిట్‌గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ భామ. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న స్యామ్.. తన జిమ్ వర్కవుట్స్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే తన బాడీని మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంది.. ఇప్పటికే మానసికంగా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్న స‌మంత.. తను ఫిజికల్‌గానూ అంతే బలంగా ఉన్నానని నిరూపించుకునే పనిలో పడిపోయింది. ఎప్పుడూ జిమ్‌లోనే ఉంటూ చమటలు కక్కిస్తుంది స్యామ్. అంత ఇమేజ్ ఉన్నా.. అవకాశాలు క్యూ కడుతున్నా సమంత కష్టం మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడున్న పోటీలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. అస్సాం ట్రైన్ ఎక్కక తప్పదని సమంతకు కూడా బాగా తెలుసు. అందుకే ఫిజిక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎప్పటికప్పుడు అదిరిపోయే క‌స‌ర‌త్తుల‌తో అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది.

ఈ వీడియోలు చూస్తుంటే.. ఇన్‌స్పిరేషన్‌గానూ నిలుస్తుంది సమంత. తాజాగా మరోసారి తన జిమ్ వీడియోను షేర్ చేసింది స‌మంత. ఈమె శ్ర‌మిస్తున్న తీరు చూసి అయ్యో పాపం అంటున్న వాళ్లు కొందరైతే.. అబ్బా ఎంత కష్టపడుతుందిరా బాబూ.. ఈ మాత్రం చేస్తుంది కాబట్టే ఆ రేంజ్ ఫిట్‌గా ఉందంటున్నారు మరికొందరు. మ‌యోసైటిస్ బారిన పడిన తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి. దానికి ముందే విడాకులతో  మానసికంగా కృంగిపోయిన స్యామ్‌కు మయోసైటిస్ మరింత దెబ్బ తీసింది. తాను మెంటల్‌గా చాలా వీక్ అయిపోయానని.. అందుకే ఓ సమయంలో రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నానని.. ఒంటరిగా నరకం చూసానని చెప్పింది ఈ బ్యూటీ.  ఈ మానసిక రుగ్మ‌త‌ నుంచి బయటపడటానికి శరీరానికి ఎక్కువగా పని చెప్తుంది ఈ బ్యూటీ. ఆరోగ్య సూత్రాల‌ను కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది. దానికి తోడు ఫుడ్ విషయంలోనూ చాలా మార్చుకుంది సమంత. తన డైట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు కూడా. మయోసైటిస్ కారణంగా కోల్పోయిన ఇమ్యూనిటీ ప‌వ‌ర్ తిరిగి తెచ్చుకుంటుంది స్యామ్. దానికోసమే రాత్రింబవళ్లు చెమటలు కక్కుతూ జిమ్‌లోనే గడిపేస్తుంది.

సమంత వర్కౌట్ వీడియో..

ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది సమంత. ఈమె రెండో పెళ్లిపై ఆ మధ్య వార్తలు బాగానే వినిపించినా.. అలాంటిదేం లేదని.. అందులో నిజం లేదని తేల్చేసింది స్యామ్. తనకు అలాంటి ఆలోచన కూడా లేదని తేల్చి పారేసింది. అయితే తనకు తల్లి కావాలనే ఉందనే విషయం ఇంతకుముందే చెప్పింది సమంత. ఇప్పుడు అన్నట్లుగానే అమ్మ కాబోతున్నారని తెలుస్తుంది. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోనున్నారని.. వాళ్ల ఆలనా పాలనా చూసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ సమంతకు పిల్లలంటే మాత్రం ఎప్పట్నుంచో ఇష్టమే. అందుకే ప్రత్యూష ఫౌండేషన్‌ నుంచి చాలా మంది పిల్లల బాధ్యతను తీసుకుంది సమంత. ఇప్పుడు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వాళ్లకు అమ్మ అవ్వాలని సమంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జీవితంలో పెళ్లి అనే మాటకు ఆమె తావివ్వకుండా ఇకపై కేవలం కెరీర్‌పైనే ఫోకస్ చేయాలని చూస్తుంది కూడా. ఏదేమైనా విడాకుల తర్వాత తనను తాను ఎప్పటికప్పుడు ఫిజికల్‌, మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యేలా చూసుకుంది స్యామ్.