Sandeep Reddy Vanga - Animal: తనేంటో ఆ ఒక్కడికి చూపించడానికే 'యానిమల్‌'ని వైలెంట్‌గా తీశాడు.!

Sandeep Reddy Vanga – Animal: తనేంటో ఆ ఒక్కడికి చూపించడానికే ‘యానిమల్‌’ని వైలెంట్‌గా తీశాడు.!

Anil kumar poka

|

Updated on: Nov 25, 2023 | 12:38 PM

సందీప్ రెడ్డి వంగా..! చూడ్డానికి కాస్త సీరియస్‌గానే ఉంటాడు. మాట్లాడితే.. కొట్టినట్టే మాట్లాడతాడు. అదే సినిమా తీస్తే.. మైండ్ బ్లాక్‌ అయ్యే రేంజ్‌ సినిమానే చేస్తాడు. సగటు మనిషి మనస్తత్వాన్ని బట్టలూడదీసి మరీ తన సినిమాల్లో ప్రజెంట్ చేస్తాడు. అందుకే తను కాస్త స్పెషల్ అనే ట్యాగ్.. ఇండస్ట్రీలో ఎప్పుడో వచ్చేలా చేసుకున్నాడు. ఇక మరి కొద్ది రోజుల్లో యానిమల్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అసలైన హింస అంటే ఏంటో.. ఈ సినిమాలో చూపిస్తా అంటున్నాడు.

సందీప్ రెడ్డి వంగా..! చూడ్డానికి కాస్త సీరియస్‌గానే ఉంటాడు. మాట్లాడితే.. కొట్టినట్టే మాట్లాడతాడు. అదే సినిమా తీస్తే.. మైండ్ బ్లాక్‌ అయ్యే రేంజ్‌ సినిమానే చేస్తాడు. సగటు మనిషి మనస్తత్వాన్ని బట్టలూడదీసి మరీ తన సినిమాల్లో ప్రజెంట్ చేస్తాడు. అందుకే తను కాస్త స్పెషల్ అనే ట్యాగ్.. ఇండస్ట్రీలో ఎప్పుడో వచ్చేలా చేసుకున్నాడు. ఇక మరి కొద్ది రోజుల్లో యానిమల్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అసలైన హింస అంటే ఏంటో.. ఈ సినిమాలో చూపిస్తా అంటున్నాడు. అంతేకాదు ఈ సినిమా తెరకెక్కించడానికి కారణం.. ఆ ఒక్కరే అంటూ.. ఓ త్రోబ్యాగ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే అప్పటి ఆ వీడియోతో ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా..!

ఎస్ ! అర్జున్ రెడ్డి సినిమాతో స్ట్రెయిట్ అవే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.. ఈ సినిమానే కబీర్ సింగ్‌ గా బాలీవుడ్‌లో రిమేక్ చేసి మరో సారి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. అయితే బాలీవుడ్‌ మీడియా ఇచ్చే మూవీ రివ్యూల్లో.. మాత్రం చాలా నెగెటివ్ కామెంట్స్ మూటగట్టుకున్నాడు. ఇక ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన కబీర్ సింగ్ సినిమాను ఫేమస్ న్యూస్ పర్సన్, రాజీవ్ మసంద్ రివ్యూ చేశారని.. వైలెంట్ ఫిల్మ్ అని తన సినిమాను కామెంట్ చేశాడని సందీప్ చెప్పాడు. అయితే వైలెంట్ ఫిల్మ్ కబీర్ సింగ్ కాదని.. నెక్ట్స్ తను తీయేబోయే యానిమల్ సినిమా అని అప్పుడే ఆఇంటర్వ్యూలోనే రివీల్ చేశాడు ఈ డైరెక్టర్. అంతేకాదు రాజీవ్ మసంద్‌కు అసలు సిసలైన వైలెంట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ.. అప్పుడే కాస్త గట్టిగా చెప్పాడు. ఇక చెప్పినట్టే.. యానిమల్ సినిమాతో.. ఆ సినిమాలోని వైలెంట్ సీన్లతో.. ఇప్పుడందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.