Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: శ్రీలీలకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. అసలు సినిమా ఇప్పుడే మొదలైందా..?

రెండేళ్ల కింద కృతి శెట్టికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు శ్రీలీలకు కూడా వస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన కృతికి వరస ఫ్లాపులు రావడానికి కూడా పెద్దగా టైమ్ పట్టలేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అసలు కృతి జాడ కూడా కనిపించడం లేదు. దానికి కారణం కూడా ఆమె మూవీస్ ప్లాప్ కావడమే. అందుకే మిగిలిన హీరోయిన్లు అలా కాకుండా ఉండాలని ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Sreeleela: శ్రీలీలకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. అసలు సినిమా ఇప్పుడే మొదలైందా..?
Sreeleela
Follow us
Praveen Vadla

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 25, 2023 | 12:15 PM

ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కాదు.. వచ్చిన విజయాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్లడం అనేది ఇండస్ట్రీలో చాలా ముఖ్యం. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్లు తప్పటడుగులు వేస్తుంటారు. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ ఇదే జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల కింద కృతి శెట్టికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు శ్రీలీలకు కూడా వస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన కృతికి వరస ఫ్లాపులు రావడానికి కూడా పెద్దగా టైమ్ పట్టలేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అసలు కృతి జాడ కూడా కనిపించడం లేదు. దానికి కారణం కూడా ఆమె మూవీస్ ప్లాప్ కావడమే. అందుకే మిగిలిన హీరోయిన్లు అలా కాకుండా ఉండాలని ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ జాతకం మారడానికైనా.. తిరగబడటానికైనా ఒక్క శుక్రవారం చాలు.. అలాంటిది శ్రీలీలకు వరసగా శుక్రవారాలు వస్తున్నాయి. మొన్నామధ్య వచ్చిన స్కంద దారుణంగా నిరాశ పరిచింది.

పోనీలే ఇప్పుడు ఆదికేశవతో ఫామ్‌లోకి వచ్చేద్దాం అనుకుంటే మరోసారి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తుంది. నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలకు వరసగా ఫ్లాపులు కంగారు పెడుతున్నాయి. స్కంద తర్వాత భగవంత్ కేసరితో ఎలాగోలా హిట్ కొట్టింది ఈ బ్యూటీ. కానీ అందులో ఈమె హీరోయిన్ కాదు.. కీలక పాత్రలో నటించింది అంతే. మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలు మాత్రం నిరాశ పరుస్తుండటంతో శ్రీలీల జాతకం తిరగబడేలా కనిపిస్తుందిప్పుడు. భగవంత్ కేసరిలో శ్రీలీల చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. చాలా గట్స్ ఉన్న అమ్మాయి పాత్రలో నటించింది ఈ చిత్రంలో. అయితే హీరోయిన్‌గా మరోసారి సత్తా చూపించాలని కలలు కన్న వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మాత్రం దారుణంగా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి పెద్దగా కోరుకున్న రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఎప్పుడో మూలన పడిన పాత చింతకాయ పచ్చడిలాంటి కమర్షియల్ కథనే మళ్లీ తిప్పి తిప్పి తీసాడు దర్శకుడు శ్రీకాంత్. ఇప్పటి వరకు శ్రీలీల కెరీర్‌లో ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ స్పెషల్ రోల్ అయితే చేసారు.

శ్రీలీల ఇన్‌స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

స్కందలోనూ ఈమె సిఎం కూతురుగా కథలో కీలకమైన పాత్ర చేసారు. కానీ ఆదికేశవలో మాత్రం కేవలం ఓ కమర్షియల్ హీరోయిన్‌గానే మిగిలిపోయారు. పాటలకు పరిమితం అయిపోయే పాత్ర ఇది.. అప్పుడప్పుడూ వచ్చి హీరోను ఓదార్చే రోల్.. ఆయనతో రొమాన్స్ చేసే రోల్ అంతే. ఈ కారెక్టర్ అయితే ఆమె కెరీర్‌కు ఏ మాత్రం హెల్ప్ అయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. పరమ రొటీన్ సినిమాగా వచ్చిన ఆదికేశవ మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. స్కంద, ఆదికేశవతో వరసగా రెండు షాకులు తగిలేసరికి శ్రీలీలలో భయం కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ డిసెంబర్‌లో రాబోయే నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, జనవరిలో పండక్కి రానున్న మహేష్ బాబు గుంటూరు కారంపైనే ఉన్నాయి. ఈ రెండూ హిట్ అయితేనే మళ్లీ అమ్మడి జాతకం మారుతుంది. లేదంటే మాత్రం సీన్ రివర్స్ అవ్వడానికి ఎంతో టైమ్ పట్టకపోవచ్చు.