Vadhuvu OTT: వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి.. భయపెడుతోన్నవధువు ట్రైలర్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్‌లకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లకు బాగా ఆదరణ లభిస్తోంది. వేణు అతిథి, ఓంకార్ మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిదే కోవలో మరో ఆసక్తికర వెబ్ సిరీస్ రానుంది.
ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్‌లకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లకు బాగా ఆదరణ లభిస్తోంది. వేణు అతిథి, ఓంకార్ మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిదే కోవలో మరో ఆసక్తికర వెబ్ సిరీస్ రానుంది. అదే అవికా గోర్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న వధువు. . మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. ఇప్పటికే దీని నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్ వధువు సిరీస్‌పై ఆసక్తిని పెంచేశాయి. మ్యాన్షన్ 24 సిరీస్ లాగే ఇది కూడా హార్రర్ థ్రిల్లర్ జోనర్‌కు సంబంధించినదేనని అర్థమైంది. తాజాగా వధువు వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. అయితే ఈ పెళ్లిలో అన్నీ రహస్యాలే’ అంటూ పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఇందు (అవికా గోర్) చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆనంద్ ను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన ఇందుపై వరుసగా హత్యా యత్నాలు జరుగుతాయి. మరోవైపు అత్తారింట్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంది. మరి ఇందును హత్య చేసేందుకు ఎవరు ప్రయత్నించారు? ఈ మిస్టరీలోని నిజాలను ఆమె తెలుసుకుందా? అనేది తెలియాలంటే వధువు వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వధువు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీప్లస్ హాట్‍స్టార్‌లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది. బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హోయ్‍చాయ్‍కు రీమేక్‍గా వధువు వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు, వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, అమ్మ రమేష్, కాంచన్ బమ్నే, కేఎల్ కే మణి, శ్రీదేవి అర్రోజు, సౌజాస్, ఇందు అబ్బే, సురభి పద్మజ, తులసీ శ్రీనివాస్, సురభి దీప్తి, శుభశ్రీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‍వీఎఫ్ పతాకంపై అభిషేక్ దాగా ఈ సిరీస్‍ను నిర్మిస్తుండగా, పోలేరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రధాన పాత్రలో అవికా గోర్..
What happens when unanswered questions welcome the new bride?
Here’s the trailer of #VadhuvuOnHotstar. All questions will be answered from December 8.#VadhuvuonHotstar coming soon only on @DisneyPlusHS.@avika_n_joy @ActorAliReza @ActorNandu @iammony @shrikantmohta… pic.twitter.com/lMpDB5rcDu
— SVF (@SVFsocial) November 24, 2023
వధువు ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..