Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ‘ధూత’ వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..

ఇటీవల నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక డిసెంబర్ 1న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంటుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా తొలిసారి చైతూ వెబ్ సిరీస్ చేయడంతో ధూతను చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Naga Chaitanya: 'ధూత' వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 25, 2023 | 4:28 PM

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ‘ధూత’ అనే సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక డిసెంబర్ 1న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంటుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా తొలిసారి చైతూ వెబ్ సిరీస్ చేయడంతో ధూతను చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ధూత సిరీస్ కోసం చైతన్య ఎంత వసూలు చేశారో తెలుసా ?..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘ధూత’లో తన పాత్ర కోసం నాగ చైతన్య రూ. 5 నుండి 8 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అద్భుతమైన కెరీర్‌కు కొత్త కోణాన్ని జోడించి.. ఇందులో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడం ఖాయమని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ సాగర్ కనిపించనున్నాడు. ధూత సిరీస్ తో ఓటీటీ అరంగేట్రం చేస్తున్న చైతూకు కెరీర్ లో మరో పెద్ద విజయం సాధించడం ఖాయమంటున్నారు. ఈ సిరీస్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం చైతూ డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. మత్య్సకారుల జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..