Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel: హైలెస్సో హైలెస్సా.. ‘తండేల్’ జాతరలో సాయి పల్లవి, నాగ చైతన్య స్టెప్పులు.. వీడియో ఇదిగో

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు

Thandel: హైలెస్సో హైలెస్సా.. 'తండేల్' జాతరలో సాయి పల్లవి, నాగ చైతన్య స్టెప్పులు.. వీడియో ఇదిగో
Thandel Movie Event
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2025 | 6:56 AM

లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్‌ వేదికగా ‘తండేల్‌ జాతర’ పేరుతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌నునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా పేరుకు తగ్గట్టుగానే తండేల్ జాతర ఈవెంట్ ఆద్యంతం ఉల్లాసభరితంగా జరిగింది. ఈ సందర్భంగా తండేల్ సినిమాలోని హైలెస్సో.. హైలస్సా, శివ శక్తి పాటలకు సాయి పల్లవి, నాగచైతన్య స్టేజిపై డ్యాన్స్ వేసి ఆహూతులను అలరించారు. సినిమాల్లో తప్ప బయట పెద్దగా డ్యాన్సులు చేయని నాగ చైతన్యను అల్లు అరవింద్‌ చేయి పట్టుకొని స్టేజీ పైకి తీసుకొచ్చి మరీ డ్యాన్స్‌ చేయించడం విశేషం. అంతకు ముందు ఇదే పాటకు అల్లు అరవింద్, యాంకర్ సుమ కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

తండేల్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే వైజాగ్, చెన్నై, ముంబై ప్రాంతాల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్.. ఆదివారం హైదరాబాద్ లో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా రాలేకపోయాడని అల్లు అరవింద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

నాగ చైతన్యను స్టేజ్ పైకి తీసుకొచ్చి మరీ..

కాగా తండేల్ సినిమాకు ఇండస్ట్రీలోని టాప్ టెక్నీ షియన్లు పని చేస్తుండడం విశేషం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.