AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: శోభితను ఆ పేరుతోనే పిలుస్తుంటాను.. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఫీలైంది.. నాగచైతన్య..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న సినిమా తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Naga Chaitanya: శోభితను ఆ పేరుతోనే పిలుస్తుంటాను.. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఫీలైంది.. నాగచైతన్య..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2025 | 7:11 AM

Share

డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం తండేల్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్య్సలేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్రయూనిట్.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, నిర్మాత దిల్ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “తన సినిమాలే కాదు.. సందీప్ వంగా ఇంటర్వ్యూల్లో మాటలు కూడా ఎంతో నిజాయితీగా, వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడి దగ్గర ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీ వాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తండేల్ రాజు పాత్రకీ, నా నిజ జీవితానికీ చాలా వ్యత్సాసం ఉంటుంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవడానికి నాకు కావాల్సినంత టైమ్ ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటివరకు మేం ఎక్కడికి వెళ్లినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. ఇలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకులలోకి సినిమాను తీసుకెళ్లారు డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ” అని అన్నారు.

‘ఇంట్లో శోభితను బుజ్జితల్లి అనే పిలుస్తుంటాను. ఈ సినిమాలో కథానాయికనీ అలాగే పిలుస్తుంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావడంతో ఆమె ఫీలైంది’ అంటూ నవ్వులు పూయించారు చైతూ.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..