AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: తండేల్ జాతర ఈవెంట్‌కు హాజరు కాని అల్లు అర్జున్.. రీజన్ చెప్పిన అల్లు అరవింద్

తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం (ఫిబ్రవరి 01)నే జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఆదివారం (ఫిబ్రవరి 02)కు వాయిదా పడింది. కాగా ఈ జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది.

Allu Arjun: తండేల్ జాతర ఈవెంట్‌కు హాజరు కాని అల్లు అర్జున్.. రీజన్ చెప్పిన అల్లు అరవింద్
Thandel Movie Jaathara Event
Basha Shek
|

Updated on: Feb 03, 2025 | 7:45 AM

Share

నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం తండేల్. గతంలో వీరిద్దరూ జంటగా నటించిన లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తండేల్ సినిమాలో మరోసారి జత కట్టారీ జోడి. చందూ మొండేటి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడంతో మొదటి నుంచి తండేల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 07న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటకే చెన్నై, వైజాగ్ తదితర చోట్ల ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్ లో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. శనివారమే జరగాల్సిన ఈ ఈవెంట్ అనివార్య కారణాలతో ఆదివారానికి వాయిదా పడింది. కాగా తండేల్ జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కూడా తండేల్ ఈవెంట్ పై బాగా ఆసక్తి చూపించారు. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ వస్తున్న తొలి మూవీ ఈవెంట్ కావడంతో బన్నీ ఏం మాట్లాడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చివరి నిమిషంలో తండేల్ జాతర నుంచి తప్పుకున్నాడు బన్నీ. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ వివరించారు.

‘తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ గెస్టుగా రావాల్సి ఉంది. కానీ ఫారెన్ నుంచి వచ్చాడు. చాలా సివియర్‌గా గ్యాస్ట్రిటిస్ (గ్యాస్ పెయిన్) వచ్చింది.. అందుకే రాలేకపోయాడు.. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు.. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి’ అని అల్లు అరవింద్ చెప్పారు. మొత్తానికి బన్నీ రాకపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

ఇవి కూడా చదవండి

నాగ చైతన్య, సాయి పల్లవిల డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..