Sonu Nigam: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సింగర్.. లైవ్ ఈవెంట్లో అసలు ఏం జరిగింది.. ?
బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతల మనసులను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అనేక పాటలు పాడి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుున్న ఈ సింగర్.. ఇప్పుడు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సోనూ నిగమ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

భారతదేశంలోని సినీపరిశ్రమలోని ప్రసిద్ధ గాయకులలో సోనూ నిగమ్ ఒకరు. హిందీలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్. ఇటీవలే సింగర్ అర్జిత్ సింగ్ కు పద్మ శ్రీ అవార్డ్ రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో విమర్శలకు గురయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా సోనూ నిగమ్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం జరిగిన లైవ్ పెర్ఫార్మెన్స్ సమయంలో అతడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. వెన్నునొప్పి తీవ్రంగా బాధించినప్పటికీ అతడు తన ప్రదర్శనను కొనసాగించాడు. నొప్పి మరింత తీవ్రం కావడంతో సంగీత కచేరి అనంతరం ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యం గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు.
సోనూ నిగమ్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించారు. అంతేకాదు.. అతడికి సొంతంగా బ్యాండ్ సైతం కలిగి ఉంది. కొంతకాలంగా అతడు ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా లేడు. ఆసుపత్రి బెడ్ పై నుంచి వీడియో షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పాడు సోనూ నిగమ్. “నా జీవితంలో కష్టతరమైన రోజు. నేను పాటలు పాడుతూ వేదిక చుట్టూ తిరుగుతున్నాను. అప్పుడు నొప్పి వచ్చింది. కానీ ఎలాగోలా మేనేజ్ చేశారు. వెన్నులో చాలా నొప్పిగా ఉంది. నా వీపులో ఎవరో ఇంజక్షన్ సూది వేసినట్లు అనిపించింది. కొంచెం కదిలినా నొప్పి తగ్గేది ” అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.
సోనూ నిగమ్ వీడియోపా అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని.. మీ బాధ చూడలేకపోతున్నామంటూ కొందరు గాయకుడికి మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం సోనూ నిగమ్ ఆరోగ్య పరిస్థితి పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సోనూ నిగమ్ హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడలోనూ అనేక పాటలు పాడారు.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన