RRR-Ram Charan: పదేళ్ల క్రితం పనికిరాడన్నారు.. ఇప్పుడు ఎగబడి చూస్తున్నారు.. బాలీవుడ్‌లో రామ్ చరణ్ మానియా!
ఆర్ఆర్ఆర్ (RRR).. దేశవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన తొలిరోజే వందకోట్లకు పైగా క్రాస్ చేసి రికార్డ్స్ సృష్టిస్తోంది.
ఆర్ఆర్ఆర్ (RRR).. దేశవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన తొలిరోజే వందకోట్లకు పైగా క్రాస్ చేసి రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇక థియేటర్ల వద్ద చరణ్ (Ram Charan).. తారక్ (NTR Jr) ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. విజువల్స్… మ్యూజిక్.. ఎమోషన్స్ పరంగా సినిమా అదుర్స్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అంతేకాకుండా.. దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచేశారంటూ సినీ విశ్లేషకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. గొండు వీరుడు కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఇందులో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరిద్దరు అద్భుతంగా నటించారంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే నార్త్‌లో ఎన్టీఆర్ అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి కాగా.. ఇప్పటికే చరణ్ మాత్రం ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
2013లో జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చెర్రీ. ఇందులో చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాని రిఫరెన్స్‌గా చేసుకుని జంజీర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో బాలీవుడ్ సినీ విశ్లేషకులు చెర్రీని విమర్శించింది. బాలీవుడ్ లెజెండ్ సినిమాను చెడగొట్టారని.. అతను నిజాంగానే హీరోనా అని.. మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకలేదని..మెగాస్టార్ హీరో కొడుకు అయితే హీరో ఐపోతాడా అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు.. క్రిటిక్స్.. సినీ వర్గాలు చెర్రీని తీవ్రంగా విమర్శించాయి. దీంతో ఆ తర్వాత చరణ్.. హిందీలో సినిమా చేయలేదు. ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లాడు.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అప్పుడు ఎవరైతే విమర్శించారో… ఇప్పుడు వాళ్లే చెర్రీని గొప్ప నటుడు అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత చరణ్ పై ఉన్న భావన పూర్తిగా మారిపోయింది.. జంజీర్ సినిమా చేసినప్పటికీ.. ఇప్పటికీ రామ్ చరణ్‌లో చాలా మార్పు వచ్చిందని.. ఈ సినిమాలో చరణ్ నటన అద్భుతమంటూ పొగిడేస్తున్నారు.. ఒకప్పుడు తిట్టినవాళ్లే.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.. సోషల్ మీడియా వేదికగా చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు అభిమానులు.. మనల్ని పొగిడేవాళ్ళే… కానీ విమర్శించిన వాళ్లే.. తిరిగి పొగిడినప్పుడే అసలైన విజయం సాధించినట్టు అని చరణ్ నిరూపించాడు.. పాన్ ఇండియా లెవల్లో చరణ్.. తారక్ స్టార్డం ఏకంగా పెరిగిపోయింది.
Also Read: Beast: పాన్ ఇండియా స్టార్‌గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..
Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..
Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..