AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhi Pinishetty: రహస్యంగా హీరోయిన్‏తో ఎంగెజ్‏మెంట్ చేసుకున్న ఆదిపినిశెట్టి.. ఆరోజు స్పెషల్ అంటూ పోస్ట్..

యంగ్ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో .. ప్రముఖ

Aadhi Pinishetty: రహస్యంగా హీరోయిన్‏తో ఎంగెజ్‏మెంట్ చేసుకున్న ఆదిపినిశెట్టి.. ఆరోజు స్పెషల్ అంటూ పోస్ట్..
Aadhi
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2022 | 7:24 PM

Share

యంగ్ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో .. ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే వీరిద్దరి పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలసిందే. తాజాగా పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమేనంటూ తెల్చీ చెప్పాడు ఆదిపినిశెట్టి. హీరోయిన్ నిక్కి గల్రానీని వివాహం చేసుకోబోతున్నానని.. తమ నిశ్చితార్థం కూడా కంప్లీట్ అయ్యిందంటూ ఎంగెజ్‏మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆది. వీరిద్దరి నిశ్చితార్థం మార్చి 24న జరిగిందని.. ఆ రోజు తమ ఇద్దరి జీవితాల్లో ప్రత్యేకమైన రోజు అంటూ ఈరోజు అంటే మార్చి 26న సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

మార్చి 24.. 2022.. మా ఇద్దరికీ ఎంతో స్పెషల్. మా ఇద్దరి కుటుంబసభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. ఈ మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ట్వీట్ చేశారు. ఆ ఫోటోల్లో నిక్కీ గల్రానీ.. ఆదిపినిశెట్టి సంప్రదాయ దుస్తుల్లో నవ్వుతూ కనిపించారు. నెటిజన్లతోపాటు.. పలువురు సినీ ప్రముఖులు వీరిద్దరికీ శుభకాంక్షలు తెలుపుతున్నారు. 2015లో విడుదలైన యాగవరైనమ్ నా కక్కా సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత మరగాధ నాణ్యం సినిమాతో ప్రేమగా మారింది. ఆదికి తెలుగులోనూ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. మలుపు.. గుండెల్లో గోదారి.. నిన్నుకోరి.. రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆది.. అల్లు అర్జు్న్ నటించిన సరైనోడు సినిమాతో విలన్ పాత్రలోనూ మెప్పించాడు ఆది.

Also Read: Beast: పాన్ ఇండియా స్టార్‏గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..

Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..

Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‏లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..