Ram Charan: జపాన్‏లో రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఆ చాక్లెట్స్ చూసి ఫుల్ ఖుషి అయిన మెగా పవర్ స్టార్..

జపాల్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కు అతిథిగా వెళ్లిన చరణ్.. అక్కడ అభిమానుల నుంచి అందమైన బహుమతులు అందుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న చాక్లెట్స్ చూసి షాకయ్యాడు.

Ram Charan: జపాన్‏లో రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఆ చాక్లెట్స్ చూసి ఫుల్ ఖుషి అయిన మెగా పవర్ స్టార్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2022 | 5:04 PM

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనల్లో భాగంగా జపాన్‏లో ఉన్న సంగతి తెలిసిందే. జక్కన్న… ఎన్టీఆర్..చరణ్ ముగ్గురు తమ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జపనీస్ చూపిస్తున్న ప్రేమకు మన ఇద్దరు హీరోలు ఆశ్చర్యపోతున్నారు. తమ అభిమాన హీరోలను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ కావడం.. పలు రకాలుగా తమ ప్రేమను చూపించడం చూసి చరణ్… తారక్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇటీవల జపాల్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కు అతిథిగా వెళ్లిన చరణ్.. అక్కడ అభిమానుల నుంచి అందమైన బహుమతులు అందుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న చాక్లెట్స్ చూసి షాకయ్యాడు.

ఎందుకంటే అక్కడ చరణ్ పేరుతో చాక్లెట్స్ అమ్ముతున్నారు. తన పేరుతో చాక్లెట్స్ అమ్మడం చూసి ఫుల్ ఖుషి అయ్యాడు చరణ్. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. తమ హీరోకు విదేశాల్లో ఉన్న అభిమానం చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చరణ్… పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.