Brahmastra : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్రహ్మాస్త్ర.. అధికారికంగా ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

బ్రహ్మాస్త్ర సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బ్రహ్మాస్త్ర స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Brahmastra : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్రహ్మాస్త్ర.. అధికారికంగా ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
Brahmastra
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2022 | 4:40 PM

చాలా కాలంగా వరుస డిజాస్టర్లతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఆశలు కల్పించిన చిత్రం బ్రహ్మాస్త్ర. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. రణబీర్ కపూర్.. అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. బిగ్ బీ అమితాబ్, నాగార్జున, మౌనీ రాయ్, షారుఖ్ ఖాన్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని.. దాదాపు రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బ్రహ్మాస్త్ర స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెలిపారు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

బ్రహ్మాస్త్రానికి తిరిగి ప్రాణం కల్పించడం చాలా సవాలుతో కూడుకున్నది. ఈ చిత్రానికి అపారమైన ప్రేమ, మద్దతు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత.. విశిష్ట చరిత్ర సాంకేతికతను కలిసే గొప్ప వేడుకే బ్రహ్మాస్ర్త అన్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!