Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడియన్స్ గెట్ రెడీ.. కాంతార: చాప్టర్ 1 వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ కాంతార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రానుంది.

ఆడియన్స్ గెట్ రెడీ.. కాంతార: చాప్టర్ 1 వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి
Kantara 2
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2025 | 10:50 AM

Share

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతార: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించాడు. ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా విడుదల కానుంది. ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంతార 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా పైనే దృష్టి సారించాడు. కాగా భారీ బడ్జెట్‌తో ‘కాంతార : చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. చాలా నెలల పాటు షూటింగ్ జరుగుతుంది. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుంది. ఇన్ని కారణాల వల్ల సినిమా విడుదలకు చాలా నెలలు పడుతుంది. అంతే కాదు కాంతారా టీమ్ ను వరుస ప్రమాదాలు వెంటాడటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార: చాప్టర్ 1’ని విడుదల చేయాలని రిషబ్ శెట్టి, చిత్ర బృందం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

‘కాంతార ’ సినిమా మొదట కర్ణాటకలో మాత్రమే విడుదలైంది. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడంతో వివిధ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు రిషబ్ శెట్టి తెలిపారు. ఈ మూవీ నుంచి మరిన్ని అప్‌డేట్‌లు తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రిషబ్ శెట్టి చేతిలో గొడ్డలి పట్టుకొని భీకరంగా కనిపించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.