RGV: నేను కేవలం నా వాదన వినిపించేందుకే వచ్చా.. చెప్పాల్సింది చెప్పా.. నానితో భేటీ అనంతరం వర్మ..
ఏపీలో టికెట్ వివాదం సినిమా హాలు యజమాని నుంచి హీరోదాకా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ప్రకారం ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటోంది ఇండస్ట్రీ.
RGV: ఏపీలో టికెట్ వివాదం సినిమా హాలు యజమాని నుంచి హీరోదాకా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ప్రకారం ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటోంది ఇండస్ట్రీ. దీని వల్ల కరెంట్ ఖర్చులు రావన్నది వారి వాదన అయితే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని మరీ GO తెచ్చామంటోంది సర్కార్. జీవో వ్యవహారం పంచాయితీ చేరినా ఇరువర్గాల వాదనలో వివాదం రోడ్డున పడింది. సినిమా టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వనికి సినిమా ఇండస్ట్రీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఏ పీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
సినిమా ధరల విషయంలో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నానీ గారు మీరు అపాయింట్ మెంట్ ఇస్తే మీతో చర్చిస్తా అని వర్మ అడగటం అందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వర్మను ఆహ్వానించడం తెలిసిందే, నేడు మంత్రి నాని తో వర్మ భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ కొనసాగింది. భేటీ అనంతరం మీడియా తో వర్మ మాట్లాడారు. థియేటర్స్ మూసివేత పై ఎలాంటి చర్చ జరగలేదు అన్నారు వర్మ. పేర్ని నానితో చర్చలు సంతృప్తినిచ్చాయి అని అన్నారు వర్మ. ఐదు ముఖ్యమైన అంశాల పై చర్చించానని.. నా వర్షన్ నేను చెప్పను అని అన్నారు వర్మ. టికెట్ల రేటు తగ్గింపు విషయం పై ముందుగా చర్చించారు వర్మ. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల ఎక్స్పీఎరియన్స్ తో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని నానిగారి దృష్టికి తీసుకొచ్చా.. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. టికెట్ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించా. నేను కేవలం నా వాదన వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. చివరి నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది.. అని వర్మ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :