AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్ వర్కింగ్ స్టైల్స్ షేర్ చేసిన డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Radhe Shyam: రాధేశ్యామ్ వర్కింగ్ స్టైల్స్ షేర్ చేసిన డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Radhakrishna
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2022 | 4:58 PM

Share

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్. ఆతర్వాత సాహో సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. సాహో సినిమా మనదగ్గర పర్లేదు అనిపించుకున్నా.. బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో ప్రభాస్ క్రేజ్ అక్కడ కూడా భారీగా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఇటు తెలుగు ఆడియన్స్ తోపాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక రాధేశ్యామ్ సినిమా జనవరి14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతో ప్రభాస్ అబిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు. రాధేశ్యామ్ సినిమా సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రాధేశ్యామ్ మూవీ మేకింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. “రాధేశ్యామ్ నుంచి డార్లింగ్స్  విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే)ల ఫొటోలు మీకోసం. కాస్త వెనక్కి తగ్గి వేగంగా మళ్లీ తిరిగి వద్దాం అంటూ రాసుకొచ్చారు దర్శకుడు. ఇప్పుడు ఈ స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!