Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

చూడడానికి అచ్చం సమంత లాగానే కనిపిస్తుంది ఆషూరెడ్డి.  అందుకే ఆమెను చాలామంది   జూనియర్‌ సమంత అని పిలుస్తుంటారు.   

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో  ఫుల్ వెర్షన్ వీడియో ..
Ashu Reddy
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2022 | 2:28 PM

చూడడానికి అచ్చం సమంత లాగానే కనిపిస్తుంది ఆషూరెడ్డి.  అందుకే ఆమెను చాలామంది   జూనియర్‌ సమంత అని పిలుస్తుంటారు.   ఈ పేరుతోనే   సోషల్ మీడియాలో భారీ  ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందీ అందాల తార. ఆతర్వాత   బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొని తన అదృష్టం పరీపరీక్షించుకుంది. కాగా ఎన్నో సందర్భాల్లో సమంతే అన అభిమాన నటి అని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పుష్ప సినిమాలో సామ్ నటించిన స్పెషల్ సాంగ్ కు కాలు కదిపింది. ‘ఉ అంటావా మావా’ అనే పాటకు హుషారుగా స్టెప్పులేసింది.  కొద్ది రోజుల క్రితమే ఈ కవర్ సాంగ్ కు సంబంధించిన ఓ చిన్న టీజర్ రిలీజ్ కాగా తాజాగా ఫుల్ వీడియో విడుదలైంది.   దీంతో ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘జూనియర్ సమంత మళ్లీ ఇరగదీసింది’,  ‘ఇది నెక్ట్స్ లెవెల్ అంతే’ ‘ అమేజింగ్’, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. సినిమా విడుదలకు ముందే ఈ పాట యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ కు తోడు, సామ్ స్టెప్పులు కుర్రకారు మనసులను కొల్లగొట్టాయి. ఇటీవలే ఈ పాట ఫుల్ వెర్షన్ వీడియోను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇది కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 22 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు.

Also Read:

Konidela Upasana: రామ్ చరణ్ డాడీ డ్యూటీస్ విత్ రైమ్.. ఇన్ స్టాలో ఉపాసన ఇంట్రెస్టింగ్

పోస్ట్..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే