AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharathi: ప్రేక్షకుల కలల రాణి మరణంపై అనేక అనుమానాలు.. ఇప్పటికీ దొరకని సమాధానాలు.. దివ్య భారతి మృతి వీడని ఓ మిస్టరీ..

ప్రముఖ నిర్మాణ సంస్త సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించి బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దివ్య భారతి. ఈ మూవీతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

Divya Bharathi: ప్రేక్షకుల కలల రాణి మరణంపై అనేక అనుమానాలు.. ఇప్పటికీ దొరకని సమాధానాలు.. దివ్య భారతి మృతి వీడని ఓ మిస్టరీ..
Divya Bharathi
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2023 | 9:47 AM

Share

చిన్న వయసులోనే కథానాయికగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్‏గా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తారగా ఓ వెలుగు వెలిగింది. అంతలోనే అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచింది. అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత అంతటి మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అని గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్య భారతి. తొంభై దశకం తొలినాళ్లలో అప్పటి కుర్రాళ్ల మనసులు దొచుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్త సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించి బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దివ్య భారతి. ఈ మూవీతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇటు దక్షిణాదిలో హిట్స్ అందుకుంటూనే.. అటు విశ్వాత్మ అనే సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బీటౌన్ లో దివ్య భారతి నటించింది రెండు సినిమాలు మాత్రమే. 1992-93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. అయితే ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి. మరణానికి దగ్గర చేశాయి అంటుంటారు.

నిర్మాత సాజిద్ నాడియావాలతో ప్రేమ.. పెళ్లి.. ఆ వెంటనే మరణం. కెరీర్ ఎంత వేగంగా స్టార్ డమ్ అందుకుందో.. అంతే స్పీడ్‏గా ఆమెను మృత్యువు పలకరించింది. 1992లో ప్రియుడు సాజిద్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాది 1993 ఏప్రిల్ నెలలో అనుమానాస్పదంగా దివ్య భారతి మరణించింది. ఆమె నివసిస్తున్న భవనం పైనుంచి కిందపడి మరణించిందని అంటారు. కానీ అదే సమయంలో దివ్య భారతి మృతి పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ వాటికి సమధానాలు దొరకలేదు. అలా ప్రేక్షకుల కలల రాణి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది. చిన్న వయసులోనే వరుస హిట్స్ అందుకుంటూ తెరపై సంచలనం సృష్టించిన అందాల రాకూమారి.. అర్ధాంతరంగా వెళ్లిపోవడానికి అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.