AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Movie: సినిమా ఛాన్సులు రాకపోవడంతో బిజినెస్ రంగంలోకి.. గోదావరి మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..

నీతూ చంద్ర తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. కానీ ఈ పేరు కంటే ఎక్కువగా గోదావరి మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అందం, అభినయంతో తెలుగు వారిని కట్టిపడేసింది. గోదావరి సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పడు ఏం చేస్తుందో తెలుసా.. ?

Godavari Movie: సినిమా ఛాన్సులు రాకపోవడంతో బిజినెస్ రంగంలోకి.. గోదావరి మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
Neetu Chandra
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2025 | 6:56 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది తారలు హీరోయిన్లుగా మెప్పించినవారే. కొందరు అమ్మాయిలు ఫస్ట్ మూవీతోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగంలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవాల్సిన పలువురు ముద్దుగుమ్మలు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో నీతూ చంద్ర ఒకరు. గోదావరి సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2006 మే 19న థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈసినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటాయి. క్లాసిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించగా.. కమలినీ ముఖర్జీ కథానాయికగా కనిపించింది.

ఈ సినిమాతో కమలినీ ముఖర్జీకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఆమెతోపాటు మరో ముద్దుగుమ్మ సైతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె మరెవరో కాదు నీతూ చంద్ర. ఇందులో సుమంత మరదలి పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. 1984 జూన్ 20న బీహార్ లోని పాట్నాలో జన్మించిన నీతూ.. గ్రాడ్యూయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2003లో విష్ణువు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత 2005లో గరం మసాలా అనే సినిమాలో నటించింది. అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్ కాలేదు. కేవలం గోదావరి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో ఆడపాదడపా సినిమాల్లో కనిపించింది. 2021లో హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది.

అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు..ప్రస్తుతం వ్యాపారరంగంలోకి దూసుకుపోతుంది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజ్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీని చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ నీతూ చంద్ర ఏం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..