Ravanasura Movie : ఓటీటీలోకి వచ్చేస్తున్న మాస్ మాహరాజా హిట్ మూవీ.. రావణాసుర స్ట్రీమింగ్ ఎక్కడంటే..
డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో అను ఇమాన్యుయేల్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కథానాయికలుగా అలరించగా.. సుశాంత్ కీలకపాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్నారు మాస్ మహారాజా రవితేజ. ఇటీవల ఆయన నటించిన చిత్రం రావణాసుర థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ నెగిటివ్ పర్ఫార్మెన్స్ తో మరోసారి అదరొగట్టేశారు. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో అను ఇమాన్యుయేల్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కథానాయికలుగా అలరించగా.. సుశాంత్ కీలకపాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచి ఫ్యాన్సీ ధరకే ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు టాక్.
ఇక విడుదలైన ఆరు వారాల తర్వాత ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. దీంతో మే రెండో వారంలో ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. అంటే మే మొదటి వారంలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.