Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ పుష్ప2 స్టోరీ ఇదేనా..? అచ్చం కాంతార సినిమాలనే ఉండబోతుందా..

రీసెంట్‌ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా.. ఎట్ ప్రజెంట్ తన స్టోరీ లైన్‌ చేంజ్‌ చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంతార కాన్సెప్ట్ ను అడాప్ట్ చేసుకున్నారా అనే టాక్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ పుష్ప2 స్టోరీ ఇదేనా..? అచ్చం కాంతార సినిమాలనే ఉండబోతుందా..
Allu Arjun Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 17, 2023 | 9:17 AM

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో.. యాటిట్యూడ్‌ క్యారెక్టరైజేషన్‌తో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ పుష్ప. రీసెంట్‌ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా.. ఎట్ ప్రజెంట్ తన స్టోరీ లైన్‌ చేంజ్‌ చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంతార కాన్సెప్ట్ ను అడాప్ట్ చేసుకున్నారా అనే టాక్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది. కాంతార సినిమా.. క్లైమాక్స్‌లో హీరో రిషబ్ షెట్టి పంజర్ల వేషధారణలో.. ముఖమంతా పసుపు పూసుకుని, కిరీటం పెట్టుకుని, మెడలో మల్లెపూలు.. కనకాంబరాల దండలు వేసుకుని.. కత్తిరిచ్చిన కొబ్బరి ఆకులను దుస్తులుగా ధరించి మనకు కనిపిస్తారు. విలన్‌లను చీల్చిచండాడుతాడు. తన ప్రజలను.. తన భూమిని కాపాడుకుంటాడు. అక్కడి స్థానిక సంస్కృతి సంప్రదాయల గురించి చుట్టుపక్కల వారికి తెలిసేలా చేస్తారు.

ఇక పుష్పకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప2లోనూ.. డైరెక్టర్‌ సుకుమార్ ఇదే కాన్సెప్ట్ ను తీసుకున్నారనే టాక్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తోంది. చిత్తూరు, తిరుపతి ఏరియాల్లో జరిగే గంగమ్మ జాతరను.. ఈ సినిమాలో ప్రధాన నేపథ్యంగా తీసుకున్నట్టు.. బన్నీ లేటెస్ట్ లుక్ చూస్తేనే అర్థం అవుతుందనే టాక్ వస్తోంది.

ఈడు వచ్చిన ఆడాళ్లను వేధించే దొరగాళ్లను అంతమొందించిన గంగమ్మ అక్కడ దేవతగా కొలువైంది. అందుకే ఆమె పేరు మీదే.. ప్రతి యేటా జాతర జరుగుతోంది. ఇక ఆ జాతరలో.. మగాళ్లు గంగమ్మలా రెడీ అయి.. ఈ దేవతను కొలవడం అక్కడ ఆచారం అయింది. ఇక ఆచారాన్ని పుష్ప2 లో సుకుమార్ చూపిస్తున్నారని అంటున్నారు కొంత మంది ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ నెటిజెన్స్. కాంతార నుంచి పొందిన సూర్తితో.. లేక హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనే ఆలోచనతోనో తెలియదు కానీ.. గంగమ్మ వేషధారణలో.. ఉగ్రుడైన పుష్ప.. విలన్‌ ను చంపేసి తనను నమ్ముకున్న ప్రజలను , తను రాజ్యంగా భావించే తన ఏరియాను రక్షించుకుంటాడని వారి నుంచి కామెంట్ వస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. హీరోలు ఇలా చేయడం వల్ల స్థానిక సంస్కృతి సంప్రదాయాలు మాత్రం బయటికి వస్తాయని అవి అందరికీ తెలుస్తాయి.