Eagle Movie: రవితేజ సినిమాకు రిలీజ్ కష్టాలు.. పోటీపడుతున్న మూవీస్.. సోలో రిలీజ్ డేట్ కోసం ఛాంబర్‌కు లేఖ..
నిజానికి ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ ఈసారి పండక్కి ఎక్కువ మూవీస్ విడుదల కానుండడంతో థియేటర్స్ సరిపోవని.. ఇబ్బందులు రావడం ఖాయమని.. తమ సినిమా రిలీజ్ వాయిదా వేయాలని సూచించారట నిర్మాతలు. దీంతో ఈగల్ నిర్మాణ సంస్త పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ ఇందుకు ఒప్పుకుని తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటే.

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ఈగల్. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇందులో కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో మరోసారి రవితేజ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ ఈసారి పండక్కి ఎక్కువ మూవీస్ విడుదల కానుండడంతో థియేటర్స్ సరిపోవని.. ఇబ్బందులు రావడం ఖాయమని.. తమ సినిమా రిలీజ్ వాయిదా వేయాలని సూచించారట నిర్మాతలు. దీంతో ఈగల్ నిర్మాణ సంస్త పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ ఇందుకు ఒప్పుకుని తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటే.. ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామని అన్నారట. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈగల్ సినిమాకు మళ్లీ పోటీ ఏర్పడింది. అదే రోజున రిలీజ్ అయ్యేందుకు చాలా సినిమాలు క్యూ కడుతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన, రజినీకాంత్ లాల్ సలామ్ డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇంకా మరిన్ని చిత్రాలు అదే రోజున రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో తమకు సోలో రిలీజ్ డేట్ కావాలంటూ సదరు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ఫిలం ఛాంబర్‌కు లేఖ రాసింది.

Eagle
“సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈగల్ సినిమాను వాయిదా వేసుకున్నాం. అందుకు మా సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామని చెప్పారు. కానీ మా మూవీ విడుదల రోజే మరిన్ని చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఈగల్ సినిమాకు సోలో డేట్ ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ సినిమా సోలోగా విడులయ్యేలా సహకరించాలని ఛాంబర్ ను కోరుతున్నాం” అంటూ లేఖలో రాసుకొచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అయితే దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు🤗
Let’s celebrate our festival in theatres from FEB 9th with #Eagle :))#EagleOnFeb9th pic.twitter.com/FXG9aRa3S1
— Ravi Teja (@RaviTeja_offl) January 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
