- Telugu News Photo Gallery Cinema photos Know how many action sequences will be in Prabhas Salaar 2 movie
Salaar2: సలార్2లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో తెలుసా ??
ఫస్ట్ పార్ట్ హిట్ అయితే, సెకండ్ పార్ట్ కి వచ్చే క్రేజే వేరప్పా అంటారా? యస్... నాక్కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ అని అంటున్నారు డైరక్టర్ ప్రశాంత్ నీల్. కేజీయఫ్ విషయంలో అదే జరిగిందని అన్నారు ప్రశాంత్. ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోందన్నది సక్సెస్‌ఫుల్ డైరక్టర్ మనసులోని మాట. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ''సలార్ సెకండ్ పార్ట్ కి, ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌లాంటిది. ఆల్రెడీ ఫస్ట్ పార్టుకోసం ఒక కట్ అనుకున్నాం. కానీ ఫైనల్ కట్ చేసేసరికి కొంత స్టఫ్ మిగిలింది. దాన్ని సెకండ్ పార్టులో ఇంక్లూడ్ చేస్తాం. సలార్ సినిమాలో ఫ్రెండ్‌షిప్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
Updated on: Jan 19, 2024 | 12:36 PM

ఫస్ట్ పార్ట్ హిట్ అయితే, సెకండ్ పార్ట్ కి వచ్చే క్రేజే వేరప్పా అంటారా? యస్... నాక్కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ అని అంటున్నారు డైరక్టర్ ప్రశాంత్ నీల్. కేజీయఫ్ విషయంలో అదే జరిగిందని అన్నారు ప్రశాంత్. ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోందన్నది సక్సెస్‌ఫుల్ డైరక్టర్ మనసులోని మాట. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ''సలార్ సెకండ్ పార్ట్ కి, ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌లాంటిది.

ఆల్రెడీ ఫస్ట్ పార్టుకోసం ఒక కట్ అనుకున్నాం. కానీ ఫైనల్ కట్ చేసేసరికి కొంత స్టఫ్ మిగిలింది. దాన్ని సెకండ్ పార్టులో ఇంక్లూడ్ చేస్తాం. సలార్ సినిమాలో ఫ్రెండ్‌షిప్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సలార్ కోసం ఓ అద్భుతమైన వరల్డ్ సెటప్ చేశాం. ఫస్టాఫ్‌లో దేవ, వరద ఫ్రెండ్‌షిప్ మాత్రమే చూశారు. సెకండ్ పార్టులో అంతకు మించి డ్రామా ఉంటుంది. ఫెంటాస్టిక్ ఫీల్ ఇస్తుంది. ఇద్దరు మంచి స్నేహితులు, బిగ్గెస్ట్ ఎనిమీస్‌గా మారితే ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు.

అసలు అంత మంచి స్నేహితులు ఎందుకు విడిపోయారు? ఎప్పుడు విడిపోయారు? ఎలా విడిపోయారు? అంత మానసిక విధ్వంసం ఎందుకు జరిగింది? అనేది...సలార్2 లో చూడొచ్చు. ఫస్ట్ పార్టులో చూసిన కేరక్టర్లు, వాటి చుట్టూ ఉన్న ప్రపంచం... ప్రతిదానికీ సెకండాఫ్‌లో ఓ అర్థం ఉంటుంది. ఓ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడైనా ముందు ఎండింగ్ రాసుకుంటా. సలార్‌కి కూడా ముందు ఎండింగ్ రాసుకున్నా. ఆ తర్వాతే మిగిలినవన్నీ యాడ్ చేసుకున్నా.

నేను క్రియేట్ చేసిన ప్రతిదీ, క్లైమాక్స్ కి శోభ తెచ్చేదే. సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్‌లో మూడు యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. సెకండ్ పార్టులో యాక్షన్ అంతకు మించి ఉంటుంది. చాలా అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. అయితే అది కేవలం సెల్లింగ్ పాయింట్ కోసం కాదు. కథతో ముడిపడిన యాక్షన్‌గా డిజైన్ చేస్తున్నాం. ఎమోషనల్‌గా ఉంటుంది'' అని అన్నారు.

సలార్ రిజల్ట్ చూసి ప్రభాస్ హ్యాపీగా ఉన్నారని అన్నారు ప్రశాంత్. తాను మాత్రం పూర్తిగా శాటిస్‌ఫై కాలేదని చెప్పారు. దీని గురించి మాట్లాడుతూ ''సలార్ విషయంలోనే కాదు, కేజీయఫ్2తోనూ నేను శాటిస్‌ఫై కాలేదు. నేనే కాదు, ఏ క్రియేటర్‌కైనా, ఇంకేదో చేయాల్సిందనే భావన ఉండిపోతుంది. కాకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా బాక్సాఫీస్ నెంబర్లు ముఖ్యం. కలెక్షన్లు మేజిక్ చేయాలి. ఆ మేజిక్ ఎప్పుడో జరిగింది. సలార్2 ఇంతకు మించి ఉంటుంది.

కథ పరంగా, విజువల్స్ పరంగా, కలెక్షన్ల పరంగా ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చూస్తాం'' అని అన్నారు ప్రశాంత్ నీల్. తాను ఏ భాషా హీరోతో సినిమా చేస్తే, వారు పాపులర్ అయిన భాషలోనే ఫస్ట్ సినిమా చేస్తానని అన్నారు. యష్‌తో కేజీయఫ్ తీసినప్పుడు కన్నడ ప్రేక్షకులను, ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించినప్పుడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్నట్టు చెప్పారు. ఆయా హీరోలకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌ని దృష్టిలో ఉంచుకుంటానని అన్నారు నీల్.




