Mega 154: మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ జాయిన్.. వీడియో అదిరిపోయిందిగా..

ఇక ఇందులో మాస్ మాహారాజా రవితేజ సైతం కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేశారు మేకర్స్.

Mega 154: మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ జాయిన్.. వీడియో అదిరిపోయిందిగా..
Raviteja Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 5:31 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల చిత్రీకరణలో పాల్గోంటూ క్షణం తీరక లేకుండా గడిపేస్తున్నారు. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ చిరు ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్‏తో ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఆచార్య మూవీ ప్రమోషన్లలోనూ చిరు ఈ విషయాన్ని లీక్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని కమర్షియల్ హంగులతో  మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇందులో మాస్ మాహారాజా రవితేజ సైతం కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేశారు మేకర్స్.

మెగా 154 షూటింగ్‏లో రవితేజ జాయిన్ అయ్యారని చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ పవర్ ఫుల్ ఫోటోతోపాటు వీడియోను రివీల్ చేశారు మేకర్స్. కారు నుంచి దిగిన రవిజేత .. కారవాన్ దగ్గరు వచ్చిన అన్నయ్య అని పిలవగా.. చిరు షేక్ హ్యాండ్ ఇస్తూ లోపలికి తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‏తో పాటు శంకర్ దాదా.. మాతో పెట్టుకుంటే అనే సాంగ్స్ ప్లే అవుతున్నాయి. మెగా మాస్ కాంబో ప్రారంభమయ్యింది అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ,  రవితేజ డాన్ శీను, బలుపు చిత్రాలకు రచయితగా పనిచేశారు. పవర్ సినిమాతో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన ఫేవరేట్ స్టార్, ఫస్ట్ సినిమా హీరోతో ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేయడం దర్శకుడికి కల నిజమైనట్లయింది. ఈ సినిమాని ఇద్దరి అభిమానులకు పూనకాలు ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు.ఒక వారం రోజులు వరకు చిరంజీవి రవితేజకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ ని హైదరాబాదులో స్టార్ట్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు, పలువురు ప్రముఖ నటీనటులు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.