Viral Photo: ఆమె కనుచూపు తాకితే రాయికైనా ప్రాణం రాదా..? ఆమె అందాన్ని చూస్తే చందమామ కూడా అసూయపడదా..?

సోషల్ మీడియా వ్యాప్తి పెరగడంతో పలువురు సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు నెట్టింట సర్కులేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు పెద్ద స్టార్.. ఎవరో మీరు కనిపెట్టగలరా..?

Viral Photo: ఆమె కనుచూపు తాకితే రాయికైనా ప్రాణం రాదా..? ఆమె అందాన్ని చూస్తే చందమామ కూడా అసూయపడదా..?
Heroine Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 16, 2022 | 5:25 PM

Trending Photo: ప్రజంట్ సోషల్ మీడియా(Social Media) వినియోగం ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్ బుక్(facebook), ఇన్ స్టా, ట్విట్టర్(Twitter), స్నాప్ చాట్ వంటి అకౌంట్స్ ఉండటం ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. అందరూ తమకు సంబంధించిన అప్‌డేట్స్, తమ వేకేషన్ ట్రిప్ డిటేల్స్, ఫంక్షన్స్, పార్టీస్‌కు సంబంధించిన అనుభవాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక తమ అభిమాన స్టార్స్, స్పోర్ట్ స్టార్స్ సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్‌ను కూడా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇక సినీ తారలు ఏదైనా వివాదాల్లో ఉన్నా.. వారి బర్త్ డే, పెళ్లి రోజు అయినా.. వారిని సంబంధించిన  రకరకాలు ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ప్రస్తుతం నెట్టింట తెగ హాట్ టాపిక్‌గా ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఎవరో మీరు ఈ పాటికే గుర్తు పట్టి ఉంటారు. లేదంటే మేమే చెప్పేస్తాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్.

బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్ చాన్నాళ్ల తరువాత న్యూస్ మేకర్ గా మారారు. ఆమె తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీతో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని లలిత్ మోడీ ట్విట్టర్ ద్వారా ఫొటోలు షేర్ చేసి తెలిపారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో డేటింగ్‌ చేసిన ఫొటోలను పంచుకున్నాడు. మై బెటర్‌ హాఫ్‌ అంటూ సంబోధించిన లలిత్‌.. తన జీవితానికి కొత్త ఆరంభం లభిస్తోందని ట్వీట్‌ చేశాడు. తర్వాత మరో ట్వీట్‌ చేసి.. ఇంకా పెళ్లి కాలేదు జస్ట్‌ డేటింగ్‌ అంటూ ప్రకటించాడు. లలిత్‌ మోడీ ఇప్పటికే అనేక ఆర్థిక సంబంధమైన ఫ్రాడ్‌ కేసుల్లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అవకతవకలకు పాల్పడినట్లు 2013లో జరిగిన విచారణలో తేలింది. అప్పటి నుంచి లలిత్‌ మోడీ లండన్‌లోనే తలదాచుకుంటున్నాడు. ఇప్పుడు సుస్మితాసేన్‌తో డేటింగ్‌.. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు లలిత్‌.

ఇదిలా ఉంటే సుస్మితా సేన్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. ఇప్పటికీ ఆమె ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి సహజీవనమూ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే… ఆ బంధం పెళ్లిపీటలెక్కకుండానే పెటాకులైంది. కొన్నాళ్ల తర్వాత.. సుస్మిత సేన్‌.. తన కంటే వయసులో చిన్నవాడు.. ప్రముఖ మోడల్‌ రోహ్మాన్ షాల్‌తో ప్రేమలో పడింది. అయితే అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ తర్వాత పలువురితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  ఇక తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్‌ రిచ్‌ క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్‌కు ఆద్యుడు లలిత్‌ మోడీ.. ఐపీఎల్‌ సృష్టికర్తగా, ఐపీఎల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్‌.. ఆ తర్వాత పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాడు. దీంతో బీసీసీఐ అతనిని పదవి నుంచి సస్పెండ్ చేసింది. 2013 సంవత్సరంలో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని నిరూపితమైంది. దీంతో క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పాల్గొనకుండా BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది.

లలిత్‌ మోడీ, సుస్మిత మధ్య కొన్నాళ్లుగా ప్రేమ నడుస్తోంది. ఈక్రమంలోనే.. సోషల్‌ మీడియా వేదికగా… మాల్దీవుల్లో డేటింగ్‌ చేసిన ఫొటోలను పంచుకున్నారు లలిత్‌ మోడీ. అయితే.. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ… నెటిజన్స్‌ చేస్తున్న సెటైర్లు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.