Allu Arjun : ‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’.. ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన బన్నీ..
మెగాస్టార్ చిరంజీవి! ఈ పేరు వినిపిస్తే చాలు తెలుగు టూ స్టేట్స్ ఫిల్మీ లవర్స్ ఊగిపోతుంటారు. ఆయనను చూడ్డానికి ఎక్కడికైనా కదిలివస్తుంటారు. ఆయన సినిమాలు చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతుంటారు.
మెగాస్టార్ చిరంజీవి! ఈ పేరు వినిపిస్తే చాలు తెలుగు టూ స్టేట్స్ ఫిల్మీ లవర్స్ ఊగిపోతుంటారు. ఆయనను చూడ్డానికి ఎక్కడికైనా కదిలివస్తుంటారు. ఆయన సినిమాలు చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతుంటారు. ఆయన యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు. డ్యాన్స్ చేస్తే.. కళ్లప్పగించి మరీ చూస్తుంటారు. ఒంట్లోని సత్తువనంతా కూడబెట్టుకుని మరీ గోల చేస్తుంటారు. తమలోని అభిమానాన్ని ఇలాగే బయటపెడుతుంటారు. అయితే ఫిల్మీ లవర్స్‌కో.. కామన్ ఆడియన్స్‌కో.. మాత్రమే కాదు, సెలబ్రిటీలకు.. ఇప్పుడు టాలీవుడ్‌ను శాసిస్తున్న హీరోలకు కూడా.. చిరు సినిమా చూస్తూ ఇలానే చేస్తుంటారు. పట్టరాన్ని ఆనందాన్ని పొందుతుంటారు.బాలీవుడ్, కోలీవుడ్ , మల్లూ వుడ్ , సాండిల్ వుడ్ అని తేడా లేకుండా చాలా మంది హీరోలు.. చిరు డ్యాన్స్ తో చేసే మ్యాజిక్ గురించి… ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి చాలా సార్లు మాట్లాడారు. ఇక తాజాగా చిరు అల్లుడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరోసారి మెగాస్టార్ డ్యాన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మాట్లాడడమే కాదు.. చిరు డ్యాన్స్ వల్ల తను లైఫ్‌లో ఫస్ట్ టైం డబ్బు పోగొట్టుకున్నా అని ఒకప్పటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు.
“చిరంజీవిగారి వల్ల జీవితంలో ఒకే ఒకసారి నష్టపోయా. పాతికవేలు పోగొట్టుకున్నా. ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ టైంలో నాకూ నా ఫ్రెండ్‌కు మధ్య ఓ చిన్న చర్చ జరిగింది. అందులో చిరంజీవిగారు వీణ స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన సోనాలిబింద్రే ఉందని… నేను లేదని ఇద్దరం వాదించుకున్నాం. అందులోనూ.. ‘నేను ఇంద్ర సినిమా 17 సార్లు చూశా.. అందులో బాసు సోలోగానే స్టెప్ వేశారు’ అని.. మరీ మొండిగానే వాదిస్తున్నా.. వాదించడమే కాదు..ఇదే పాయింట్ పైన 25వేలు బెట్ కూడా కట్టా. కాని ఆఖరికి వీడియో చూస్తే, చిరు పక్కన సోనాలిబింద్రే కూడా స్టెప్ చేసింది. అంటే అప్పటివరకూ నేను కేవలం బ్లాక్ ప్యాంట్, రెడ్ షర్ట్ వేసుకుని వీణ స్టెప్ వేస్తున్న చిరంజీవిగారిని మాత్రమే చూశా. పక్కన ఉన్న సోనాలి బింద్రేను గుర్తించలేకపోయా” అంటూ అప్పటి ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.