Aadi Pinishetty: గొడవలతో మొదలైన ప్రేమ.. కట్‌చేస్తే పెళ్లితో ఒక్కటయ్యారు.. ఆది, నిక్కీల ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీ..
నూ, నిక్కీ మలుపు సినిమా నుంచి స్నేహితులయ్యం. ఆ సినిమా ప్రయాణంలో మా ఇద్దరి మధ్య రెండు, మూడు సార్లు గొడవలు సైతం అయ్యాయి
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టైలీష్ అండ్ హ్యాండ్సమ్ కనిపిస్తూనే భయపెడుతున్న విలన్ ఆదిపినిశెట్టి (Aadi Pinishetty). హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఆది రూటు మార్చి ప్రతినాయకుడిగా మారి అదరగొడుతున్నాడు. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా మెప్పించిన ఆది పినిశెట్టి తాజాగా ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ది వారియర్ చిత్రంలోనూ ప్రతినాయకుడిగా కనిపించాడు. డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమా జూలై 14న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆది తన ప్రేమ. పెళ్లి గురించి ఆసక్తి్కర విషయాలను పంచుకున్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. “నేనూ, నిక్కీ మలుపు సినిమా నుంచి స్నేహితులయ్యం. ఆ సినిమా ప్రయాణంలో మా ఇద్దరి మధ్య రెండు, మూడు సార్లు గొడవలు సైతం అయ్యాయి. దీంతో మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. సినిమా మొత్తం మేము మాట్లాడుకోలేదు. కానీ చివరలో మళ్లీ మా మధ్య మాటలు కలిశాయి. ముందు తనే నన్ను ప్రేమిస్తున్నానని.. నాకు ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత నేను ప్రేమిస్తున్నట్లు చెప్పాను. కొన్నాళ్లు ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకున్నాం. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పాం. మా ఇద్దరికీ మమ్నల్ని అర్థం చేసుకునే కుటుంబాలున్నాయి. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం సంతోషంగా సాగుతోంది. మేము కలిసి నటించిన శివుడు సినిమా త్వరలోనే రాబోతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే మంచి పాత్ర దొరికితే ప్రతినాయకుడిగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కథానాయికుడిగా మూడు ద్విభాషా సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.