Rashmika Mandanna: నా లైఫ్ పూలపాన్పేమీ కాదు.. అద్దె కట్టలేక రెండు నెలలకొకసారి.. గడ్డు పరిస్థితులు గుర్తుచేసుకున్న రష్మిక

పుష్ప 2 సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిన ఈ సొగసరి ప్రస్తుతం బాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకుంటూ సెలబ్రిటీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. అయితే చాలామంది లాగే తన బాల్యంలోనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోందీ బ్యూటీ క్వీన్‌.

Rashmika Mandanna: నా లైఫ్ పూలపాన్పేమీ కాదు.. అద్దె కట్టలేక రెండు నెలలకొకసారి.. గడ్డు పరిస్థితులు గుర్తుచేసుకున్న రష్మిక
Rashmika Mandanna
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2022 | 6:15 AM

సాధారణంగా సినిమా తారల జీవితం పూలపాన్పు అని చాలామంది భావిస్తారు. కోట్లలో పారితోషకం తీసుకునే వారు కోరింది కాళ్ల దగ్గరకు వచ్చేస్తుందనుకుంటుంటారు. అయితే సెలబ్రిటీల స్థాయికి చేరుకోవడానికి వారు పడిన కష్టం మాత్రం ఎవరికీ కనిపించదు. మన నేషనల్‌ క్రష్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కూడా ఇదే చెబుతోంది. పుష్ప 2 సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిన ఈ సొగసరి ప్రస్తుతం బాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకుంటూ సెలబ్రిటీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. అయితే చాలామంది లాగే తన బాల్యంలోనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది రష్మిక. తాజాగా ఓ ఛానెల్‌తో ముచ్చటించిన ఆమె తన బాల్యంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకుంది.

‘ నా జీవితం పూలపాన్పేమీ కాదు. నా చిన్నతనంలో కుటుంబం చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఇంటిని నడిపించేందుకు నాన్న చాలా కష్టపడ్డాడు. ఇంటి అద్దె చెల్లించలేక రెండు నెలలకొకసారి ఇల్లు మారుతూ ఉండే వాళ్లం. నాన్న నాకు కనీసం ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారు’ అని తన చిన్ననాటి పరిస్థితులను గుర్తుచేసుకుంది రష్మిక. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2.. దిరూల్‌’ లో నటిస్తోంది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో వారిసు (తెలుగులో వారసుడు), సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ చిత్రాల్లో కూడా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..