Rashmika Mandanna: పుష్పరాజ్ భార్యగా నా బాధ్యత మరింత పెరిగింది.. పుష్ప 2 పై ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక..
పుష్ప రాజ్ ప్రేయసి శ్రీవల్లి నుంచి గీతాంజలి వరకు అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2, యానిమల్ 2 సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలోని అగ్రకథానాయికలలో రష్మక మందన్నా ఒకరు. సౌత్ టూ నార్త్ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. జపాన్, టోక్యో అంటూ విదేశాలను చుట్టేస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండిడాయ స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇటీవలే యానిమల్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. పుష్ప రాజ్ ప్రేయసి శ్రీవల్లి నుంచి గీతాంజలి వరకు అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2, యానిమల్ 2 సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అందులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దాదాపు మూడేళ్ల తర్వాత పుష్ప చిత్రబృందంతో కలవడం గురించి చెప్పుకొచ్చింది. “ఇన్నాళ్లు పుష్ప రాజ్ ప్రేయసిని.. కానీ ఇప్పుడు పుష్ప భార్యను.. అది చాలా బాధ్యతలతో నిండి ఉన్న పాత్ర. సీక్వెల్ లో చాలా ఎక్కువ డ్రామా, పాత్రల సంఘర్షణలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఎక్కువగా మసాలా ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చింది. డైరెక్టర్ సుకుమార్ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. పుష్ప 2 పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయని తెలిపింది. పుష్ప 2 అడియన్స్ అంచనాలను అందుకుంటుందని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే యానిమల్ సినిమాలో రణబీర్ భార్య గీతాంజలి పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు పుష్పరాజ్ భార్య పాత్రలో రష్మిక మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుందని ఆమె ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. కొన్ని నెలలుగా పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు కేవలం అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ మినహా మరో అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2తోపాటు.. పుష్ప 3 ఉండే ఛాన్స్ ఉందని బన్నీ చెప్పడంతో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.