Rashmika Mandanna: రష్మిక లక్కు మాములుగా లేదు.. ఆ ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నేషనల్ క్రష్..
అయితే 'పుష్ప 2' సినిమా తర్వాత రష్మిక మందన్నకు సౌత్‌లో సినిమా లేదన్న సంగతి తెలిసిందే. కానీ హిందీ చిత్రాలతో పాటు సౌత్‌లో కూడా రష్మిక వరుసగా సినిమాలు అంగీకరిస్తోంది. తమిళ నటుడు ధనుష్‌తో రష్మిక కొత్త చిత్రంలో నటిస్తుందని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అదే సినిమాలో ధనుష్ తోపాటు అక్కినేని నాగార్జున కూడా నటించనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అటు హిందీలోనే కాకుండా ఇటు తెలుగులోనూ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తోంది రష్మిక. ప్రస్తుతం ఆమె పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. అయితే ‘పుష్ప 2’ సినిమా తర్వాత రష్మిక మందన్నకు సౌత్‌లో సినిమా లేదన్న సంగతి తెలిసిందే. కానీ హిందీ చిత్రాలతో పాటు సౌత్‌లో కూడా రష్మిక వరుసగా సినిమాలు అంగీకరిస్తోంది. తమిళ నటుడు ధనుష్‌తో రష్మిక కొత్త చిత్రంలో నటిస్తుందని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అదే సినిమాలో ధనుష్ తోపాటు అక్కినేని నాగార్జున కూడా నటించనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది.
ధనుష్ తొలిసారిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లుగా ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. అయితే ‘లీడర్’ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తోన్న రెండో రాజకీయ కథాంశం ఇదే కావడం విశేషం. తెలుగుతోపాటు తమిళంలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాతో నటుడు నాగార్జున కూడా ఎంట్రీ ఇచ్చాడు.
View this post on Instagram
ఈరోజు (ఆగస్టు 29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ధనుష్ సినిమాలో కింగ్ నటించనున్నాడని ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఇకటి రష్మిక మందన్నకు ఒకే సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్‌తో నటించే అవకాశం వచ్చింది. ధనుష్, నాగార్జున ఇద్దరితో రష్మికకి ఇదే మొదటి సినిమా.
View this post on Instagram
నటి రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా ఓ తమిళ స్టార్ నటుడితో కొత్త సినిమాకి కూడా అంగీకరించింది ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో రీసెంట్ గా ‘యానిమల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరో. టైగర్ ష్రాఫ్‌తో రష్మిక కొత్త సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా త్వరలో ప్రకటించనున్నారు.
View this post on Instagram
నటుడు ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా నటించాడు. బాలీవుడ్ మూవీ ‘తేరే ఇష్క్ మే’లో నటించనున్నాడు. ‘రేయాన్’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. తన సోదరుడు దర్శకత్వం వహించనున్న ‘ఆయరత్తిల్ ఒరువన్ 2’ చిత్రంలో నటించనున్నాడు. తమిళం, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ ధనుష్ నటిస్తూ బిజీగా ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.