Tollywood: ఈ చిన్నోడు తమిళ్ స్టార్ హీరో.. తెలుగులోనూ ఫేమస్.. ఎవరో గుర్తుపట్టండి..

ఈ చిన్నోడు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. కానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. కాగా ఆగస్ట్ 29న ఈ హీరో పుట్టిన రోజు . ఎవరో గుర్తుపట్టారా ?.

Tollywood: ఈ చిన్నోడు తమిళ్ స్టార్ హీరో.. తెలుగులోనూ ఫేమస్.. ఎవరో గుర్తుపట్టండి..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2023 | 12:35 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ చిన్నోడు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. కానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. కాగా ఆగస్ట్ 29న ఈ హీరో పుట్టిన రోజు . ఎవరో గుర్తుపట్టారా ?. అతను మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడే విశాల్. 1975 ఆగస్ట్ 29న విశాఖపట్నంలో జన్మించిన విశాల్.. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 2004లో చెల్లమే అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

ఆ తర్వాత తమిళంలో సందకోళి, తిమిరు సినిమాలతో హిట్స్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నారు విశాల్. ఆయన నటించిన పందెం కోడి సినిమాలో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఇందుల మీరా జాస్మిన్ కథానాయికగా నటించింది. ఇటీవల లాఠీ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు విశాల్. భారీ అంచనాల మధ్య విడుదైలన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మార్క్ ఆంటోని. ఎస్ జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ ముఖ్య పాత్రలు పోషించగా.. రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్15న పాన్ ఇండియా స్తాయిలో విడుదల కానుంది.ఇటీవలే ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తన పుట్టినరోజు తనకెంతో ప్రత్యేకమని.. వైవిధ్యమైన సినిమా అయిన మార్క్ ఆంటోనితో అడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..