Ananya Pandey: ఆ హీరోతో లవ్‌లో లైగర్ బ్యూటీ అనన్య పాండే.. ఈజీ హింట్‌తో రివీల్ చేసిన రణబీర్ కపూర్..!
లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే. సౌత్ ఎంట్రీ అనన్యకు అనుకున్న రేంజ్‌లో కిక్ ఇవ్వకపోయినా... ఆడియన్స్ మాత్రం ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గానే ఫాలో అవుతున్నారు. దీంతో అమ్మడి రిలేషన్‌షిప్ స్టేటస్‌లు ఇక్కడ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.
లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే. సౌత్ ఎంట్రీ అనన్యకు అనుకున్న రేంజ్‌లో కిక్ ఇవ్వకపోయినా… ఆడియన్స్ మాత్రం ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గానే ఫాలో అవుతున్నారు. దీంతో అమ్మడి రిలేషన్‌షిప్ స్టేటస్‌లు ఇక్కడ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. స్టార్ మేకర్ కరణ్ జోహార్ కాంపౌండ్ నుంచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో అనన్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా మల్టీ స్టారర్ కావటంతో అనన్యకు ఆశించినంత క్రేజ్ రాలేదు. తరువాత కూడా పతీ పత్నీ ఔర్ ఓ, అంగ్రేజీ మీడియం, కాలీ పీలీ లాంటి సినిమాలు చేసినా… హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ రాలేదు.
స్టార్ ఇమేజ్ కోసం సౌత్ హీరోను నమ్ముకున్న ఈ నార్త్ బ్యూటీ.. విజయ్ దేవరకొండకు జోడిగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు. తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చేస్తుందనుకున్న లైగర్, అనన్యకు బిగ్ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావటంతో సౌత్‌లో జెండా పాతాలన్న అమ్మడి కల నెరవేరలేదు.
సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే.. సౌత్ ఆడియన్స్‌లోనూ అనన్య క్రేజ్ మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. ఈ బ్యూటీ మూవీ అప్‌డేట్స్‌తో పాటు రిలేషన్‌షిప్ స్టేటస్‌ల గురించి కూడా తెలుగు ఆడియన్స్ ఎంక్వైరీలు చేస్తున్నారు. అలాంటి వారి కోసం తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్.
అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య సంథింగ్ సంథింగ్ అన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ మధ్య లేట్ నైట్ డిన్నర్ పార్టీల్లో వారిద్దరూ జంటగా కనిపించడంతో బాలీవుడ్ మీడియా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇద్దరి మధ్య ఏడో నడుస్తోందన్న ప్రచారం మొదలయ్యింది. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చే హింట్ ఇచ్చారు రణబీర్. ఆదిత్యకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న మాట నిజమే.. ఆ అమ్మాయి పేరు Aతో స్టార్ట్ అవుతుంది అంటూ హింట్ ఇచ్చారు. దీంతో ఆదిత్య, అనన్య రిలేషన్ విషయంలో పక్కా క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు అభిమానులు.
-జే.సతీష్ రెడ్డి, టీవీ9 తెలుగు (ఈటీ టీమ్)
మరిన్ని సినిమా వార్తలు చదవండి..