Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Glimpse: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ లుక్స్ చూశారా..?

మోస్ట్ అవైటెడ్ చిత్రం రామాయణ. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రలలో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Ramayana Glimpse: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ లుక్స్ చూశారా..?
Ramayana
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2025 | 12:54 PM

Share

ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న సినిమా రామాయణ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్నారు. ఇక కన్నడ స్టార్ యశ్ ఇందులో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని పలువురు స్టార్స్ రామాయణ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయగా.. 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోస్ మూవీపై మరింత ఆసక్తిని కలిగించాయి.

ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియోలో వీఎఫ్ఎక్స్, బీజీఎమ్ ఆకట్టుకుంటున్నాయి. “కాలం ఉనికిలో ఉన్నప్పటి నుంచి త్రిముూర్తులు ముల్లోకాలను పరిపాలిస్తున్నారు. బ్రహ్మ.. సృష్టించే దేవుడు, విష్ణువు.. రక్షించే దేవుడు, శివుడు.. అంతం చేయగలిగే దేవుడు.. కానీ వారి సృష్టి మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించబడుతున్నది. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ.. రాముడు vs రావణుడు, రావణుడు.. శక్తి, ప్రతీకారం. రాముడు.. ధర్మం, త్యాగం. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దుబే.. లక్మణుడిగా, సన్నీ డియోల్.. హనుమంతుడిగా, సంగీతం హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్. రచయితా శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం నితేశ్ తివారీ.” అంటూ వీడియోతో పాత్రలతో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్ అదిరిపోయాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..