AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni : భాగ్య శ్రీతో ప్రేమాయణం రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరో రామ్ పోతినేని..

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఓవైపు హిట్టు కోసం ప్రతి కథను శ్రద్ధగా సెలక్ట్ చేసుకుంటున్నారు. కానీ మరోవైపు రామ్ పర్సనల్ విషయాల గురించి ఏదోక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దామా.

Ram Pothineni : భాగ్య శ్రీతో ప్రేమాయణం రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరో రామ్ పోతినేని..
Ram Pothineni
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2025 | 12:41 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైల్, ఎనర్జీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని. ఇండస్ట్రీలో అతడికి మంచి గుర్తింపు ఉంది. కానీ చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ఇప్పటివరకు మరో విజయాన్ని అందుకోలేకపోయారు. కానీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. రెడ్, ది వారియర్ వంటి విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. కెరీర్ మొదటి నుంచి కమర్షియల్, క్లాస్, యాక్షన్ అన్నీ జానర్లలో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్. ఇక ఇప్పుడు మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ చిత్రాన్ని నవంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ఇందులో రామ్ సరసన కొత్త హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా రామ్, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడుస్తుంది. ఇక చాలా సందర్భాల్లో వీరిద్దరు కలిసి ఓకే హోటల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడంతో రూమర్స్ కు బలం చేకూరింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న రామ్.. మొదటి సారి తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

మేమిద్దరం ప్రేమలో ఉన్నామని వస్తున్న వార్తలలో నిజం లేదని.. ఇలాంటి రూమర్స్ ఎలా పుడతాయో కూడా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో తాను రాసిన పాట సమయంలో హీరోయిన్ కూడా ఎంపిక చేయలేదని..ఇప్పటివరకు చూడని అమ్మాయి కోసం పాట ఎలా రాస్తానని అన్నారు. తనకు ప్రేమపై ఇంట్రెస్ట్ లేదని.. ఎవరి మీద అలా ఫీల్ కూడా రావడం లేదని అన్నారు. ప్రస్తుతం రామ్ పోతినేని చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

Follow Us