RGV Vyuham: పైకి రాకుండా తొక్కేసిన మనిషి.. పైకే పోయాడు.. ఇక మీరే.. ఆర్జీవీ ‘వ్యూహం’ట్రైలర్ చూశారా?

నవంబర్‌ 10న రిలీజ్‌ కావాల్సిన వ్యూహం వాయిదా పడింది. అయితే ఇటీవలే వ్యూహం సినిమాకు సెన్సార్‌ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసిన ఆర్జీవీ ఆరోజే తన మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. డిసెంబర్‌ 29న వ్యూహం సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. '

RGV Vyuham: పైకి రాకుండా తొక్కేసిన మనిషి.. పైకే పోయాడు.. ఇక మీరే.. ఆర్జీవీ 'వ్యూహం'ట్రైలర్ చూశారా?
Ram Gopal Varma Vyuham Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2023 | 4:19 PM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. జగన్‌ పాత్రలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి పాత్రలో మానస కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పొస్టర్స్‌, టీజర్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెరిగాయి. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు వ్యూహం మూవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఏకంగా సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో నవంబర్‌ 10న రిలీజ్‌ కావాల్సిన వ్యూహం వాయిదా పడింది. అయితే ఇటీవలే వ్యూహం సినిమాకు సెన్సార్‌ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసిన ఆర్జీవీ ఆరోజే తన మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. డిసెంబర్‌ 29న వ్యూహం సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఇంతకాలం మిమ్మల్ని పైకి రాకుండా తోక్కేసిన మనిషి..ఇపుడు పైకే పోయాడు..ఇక మీరే’ అనే డైలాగుతో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

‘ఓదార్పు యాత్రలో జనాలు వచ్చింది నాన్నమీద ప్రేమతో. ఆయన మరణం తర్వాత కోట్లాది మంది నాపై పెట్టుకున్న ఆశల చూసి చలించిపోయాను. ఒక విషయాన్ని నిజమో, అబద్ధమో తెలియాలంటే జీవిత కాలాలు కూడా సరిపోవు’ వంటి పొలిటికల్‌ డైలాగులతో పాటు ‘ క్షవరం అయితే కానీ వివరం తెలియదు’ వంటి సటైరికల్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం అనంతరం జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టడం, జైలుకు వెళ్లడం, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి పాదయాత్ర చేపట్టడం వంటి అంశాలను వ్యూహం సినిమాలో చూపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి పాత్రలు కూడా ఇందులో చూడొచ్చు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది వ్యూహం మూవీ. ట్రైలర్‌లో కూడా పొలిటికల్‌ డైలాగులు ఓ రేంజ్‌లోనే పేలాయి. మరి వీటిపై టీడీపీ ,కాంగ్రెస్‌ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. రామ దూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ వ్యూహం సినిమాను నిర్మించారు.

వ్యూహం ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..