Director Harish Shankar: రవితేజ, హరీష్ శంకర్ సినిమాపై రూమర్స్.. మాస్ మాహారాజా జోడిగా త్రిప్తి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవలే మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మాస్ మాహారాజా. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. షాక్, మిరపకాయ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది.

Director Harish Shankar: రవితేజ, హరీష్ శంకర్ సినిమాపై రూమర్స్.. మాస్ మాహారాజా జోడిగా త్రిప్తి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Raviteja, Harish Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2023 | 3:51 PM

టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మాహారాజా రవితేజ. స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా రూపొందించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఈగల్ మూవీలో నటిస్తున్నారు రవితేజ. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవలే మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మాస్ మాహారాజా. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. షాక్, మిరపకాయ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు.. నటీనటుల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడే ఈ సినిమాపై రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ సినిమాకు ఇద్దరు ప్రముఖ హీరోయిన్లను సంప్రదించగా.. ఇద్దరూ రిజెక్ట్ చేశారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా..రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ పోస్టులో ఉన్న సమాచారం ఏమాత్రం నిజం కాదని స్పష్టం చేశారు హరీష్ శంకర్. “రవితేజ, హరీశ్ శంకర్ సినిమాను ఇద్దరు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని సంప్రదించగా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారు. ఆ తర్వాత రెమ్యునరేషన్ కారణంగా ఇలియానా ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఇది చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తన స్టైల్లో రిప్లై ఇచ్చారు. “ఇది పూర్తిగా అవాస్తవం. శ్రుతిహాసన్ లేదా పూజా హెగ్డే.. ఇలా నా ట్రాక్ రికార్డ్ తెలిసిన వారందరికీ నా ఎంపికపై అపారమైన నమ్మకం ఉంది.. యానిమల్ విడుదలకు ముందే మా సినిమా క్యాస్టింగ్ పూర్తైంది. దయచేసి ఇలాంటి రూమర్స్ ను వ్యాప్తి చేయకండి. మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను సంప్రదించండి. మెసేజ్ లకు నేను అందుబాటులోనే ఉంటాను” అంటూ క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.