Bigg Boss 7 Telugu: బిగ్బాస్ ఫైనల్ స్టేజ్ పై సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేష్.. నాగార్జున ‘నా సామిరంగ’ కోసం సూపర్ స్టార్..
అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్, అర్జున్, ప్రియాంక వీరు ఆరుగురు ఫైనలిస్ట్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో టైటిల్ రేసులో దూసుకుపోతున్నది మాత్రం ముగ్గురే. ప్రశాంత్, అమర్, శివాజీ మాత్రమే టైటిల్ ట్రోఫికి చేరువలో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం..ఈసారి సీజన్ 7 విన్నర్ కామన్ మెన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కాబోతున్నాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ విన్నర్ గురించి తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సింది.
బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ సీజన్ విన్నర్ ఎవరు కాబోతున్నారనే క్యూరియాసిటి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్, అర్జున్, ప్రియాంక వీరు ఆరుగురు ఫైనలిస్ట్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో టైటిల్ రేసులో దూసుకుపోతున్నది మాత్రం ముగ్గురే. ప్రశాంత్, అమర్, శివాజీ మాత్రమే టైటిల్ ట్రోఫికి చేరువలో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం..ఈసారి సీజన్ 7 విన్నర్ కామన్ మెన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కాబోతున్నాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ విన్నర్ గురించి తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సింది. అయితే ఈసారి బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడని టాక్. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. మహేష్ బాబుతో నందమూరి హీరో బాలకృష్ణ సైతం రాబోతున్నాడని న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ఇక ఇప్పుడు మరో లేటేస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా వచ్చిన మహేష్.. అదే స్టేజ్ పై నా సామిరంగ టీజర్ రిలీజ్ చేస్తాడని అంటున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నా సామిరంగ. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు విజయ్. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. అల్లరి నరేష్ కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్ల అనే సాంగ్ శ్రోతలను కట్టిపడేసింది. ఇందులో నాగ్, ఆషికా జోడి కనుల విందుగా ఉంది.
ఈ పాటకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను బిగ్బాస్ ఫైనల్ స్టేజ్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం టీం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా నుంచి అల్లరి నరేష్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన వీడియోలో నరేష్ సూపర్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. అలాగే నాగార్జునతో నరేష్ కు మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఇందులో అంజి పాత్రలో కనిపించనున్నారు నరేష్.