Bigg Boss 7 Telugu: మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ టెన్షన్.. మరికాసేపట్లో ముగియనున్న ఓటింగ్‌.. లేటెస్ట్ రిజల్ట్స్ ఇవే

పల్లవి ప్రశాంత్‌, శివాజీ, అమర్ దీప్‌ చౌదరి, అంబటి అర్జున్‌, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌ బిగ్ బాస్‌ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే శుక్రవారం (డిసెంబర్‌ 15) రాత్రి మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ జరగనుందని తెలుస్తోంది. దీంతో ఎవరూ హౌజ్‌ నుంచి బయటకు వస్తున్నారన్నది క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రస్తుతం ఓటింగ్ రిజల్ట్స్‌ను ఒకసారి పరిశీలిస్తే..

Bigg Boss 7 Telugu: మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ టెన్షన్.. మరికాసేపట్లో ముగియనున్న ఓటింగ్‌..  లేటెస్ట్ రిజల్ట్స్ ఇవే
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2023 | 6:36 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ తుది అంకానికి వచ్చేసింది. ఆదివారం (డిసెంబర్‌ 17) జరిగే గ్రాండ్‌ ఫినాలే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎవరు బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతగా నిలుస్తారన్నదానిపై సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. పల్లవి ప్రశాంత్‌, శివాజీ, అమర్ దీప్‌ చౌదరి, అంబటి అర్జున్‌, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌ బిగ్ బాస్‌ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే శుక్రవారం (డిసెంబర్‌ 15) రాత్రి మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ జరగనుందని తెలుస్తోంది. దీంతో ఎవరూ హౌజ్‌ నుంచి బయటకు వస్తున్నారన్నది క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రస్తుతం ఓటింగ్ రిజల్ట్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శివాజీ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. నిన్న ఓటింగ్‌లో వెనక బడిన అమర్ దీప్‌ మళ్లీ టాప్‌-3 లోకి దూసుకొచ్చాడు. ఇవాళ్టి అర్దరాత్రితోనే ఓటింగ్‌ ముగియనుంది కాబట్టి పల్లవి ప్రశాంత్, శివాజీ,.అమర్‌ దీప్ టాప్‌-3లో నిలిచే అవకాశముంది.

ఇక ప్రిన్స్‌ యావర్‌ నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే అర్జున్‌ అంబటి, ప్రియాంక జైన్ ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓటింగ్‌ ప్రకారం చూస్తే.. అర్జున్ అంబటి, ప్రియాంక డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు. అయితే ఫినాలేకు కనీసం ఒక అమ్మాయైనా ఉండాలి కాబట్టి ప్రియాంకను బయటకు పంపించే అవకాశం లేదు. అంటే అర్జున్‌ లేదా ప్రిన్స్ యావర్‌లో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందన్నమాట. అయితే అర్జున్‌ను బయటకు పంపించేందుకు బిగ్‌ బాస్‌ టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే మిడ్ వీక్‌ ఎలిమినేషన్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. టాప్‌-6 కంటెస్టెంట్స్‌తోనే గ్రాండ్‌ ఫినాలే నిర్వహిస్తారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

ప్రియాంక వర్సెస్ ప్రిన్స్ యావర్..

పల్లవి ప్రశాంత్ కే మద్దతు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే